అటవీ భూమిపై ఆదివాసీలకే హక్కు ఉంటుంది.

 

పోడు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వాలి.

*కోయాపొచగూడెం ను సందర్శించిన తెలంగాణ ప్రజాపోరాట వేదిక రాష్ట్ర కన్వినర్ ఎస్. వీరయ్య

దండేపల్లి .జనంసాక్షి.15 ఆగస్టు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయపోచంగూడెంను తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వినర్ ఎస్. వీరయ్య సోమవారం కోయపోచగూడెంను సందర్శించి, పోరాటం గురించి పూర్తి వివరాలు ఆదివాసీ పెదలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర కన్వినర్ గారు మాట్లాడుతూ… స్వాతంత్ర్యం రాక ముందు నుండే అటవీ భూమిలో ఆదివాసీ పేదలు తాతల, తండ్రుల కాలం నుండి జీవనం సాగిస్తున్నారు.అటవీ నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసీ పేదలు సాగు చేసుకుంటున్న వారి మీద అటవీ,పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి, అక్రమంగా ఒక్కొక్కరి మీద సుమారు 13 నుండి 33 కేసులు పెట్టారు.రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, చట్టాలను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.వెంటనే పోడు చేసుకుంటున్నా ఆదివాసిలకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలి. లేకపోతే ఈ భూముల పోరాటానికి తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పూర్తి మద్దతు తెలియచేస్తుంది. ఈ సందర్శనలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కనిగరపు అశోక్ , జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్,సిపిఎం మండల నాయకులు బుచ్చన్న, రాజేశ్వరి, గిరిజన సంఘం మండల నాయకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.