: అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు వెళ్ళవద్దు. మేమున్నాం ఎవ్వరు అధైర్య పడవద్దు
జూలై 13 జనం సాక్షి:-దట్టమైన తెల్లటి మేఘాలతో కూడిన మబ్బులకు చిల్లు పడ్డట్లుగా గత కొన్ని రోజులుగా కోటగిరి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు,వంకలు,చేను,చేనకలు నీటి పరవల్లతో పొంగి పొర్లుతునాయి.చేరువులలో నీరు మత్తల్లు దుంకుతున్నయి.ఈ ఏకధాటిగా వర్షానికి వర్షం మండలంలోని పాత మట్టితో కూడిన పెంకుటిల్లు,రేకుల ఇండ్లు నీటితో ఊరుతున్నాయి.అలాగే మట్టి గోడలకు నీటి తెమ్మ ఎక్కి కొన్ని ఇండ్లు అయితే కూలిపోయాయి.ఈ సందర్భంగా గత రెండు రోజుల క్రితం స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులతో కోటగిరి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల పై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం విధితమే.ఈ సందర్భంగా స్పీకర్ సూచనల మేరకు మండల,
గ్రామ ప్రజా ప్రతినిధులు,అధికారులు,నాయకులు ప్రతి వాడ వాడన తిరుగుతూ ప్రజలకు పలు రకాల సూచనలు చేస్తున్నారు.అదేవిధంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో చెట్టు,విద్యుత్ తీగలు,
నీటి ప్రవాహలతో బయట తిరిగే వారికి ప్రమాదం పొంచి ఉన్నది,కావున ఎవరైనా అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు వెళ్ళవద్దని.ముఖ్యంగా రైతులు పొలాలకు,చెరువుల వద్దకు వెళ్లరాదని తెలిపారు.అదేవిధంగా గ్రమాలలో పలు వీధుల్లో రోడ్ల పైన చెత్తను తొలగిస్తూ ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా డ్రైనేజీ వ్యవస్థలకు అనుసంధానంగా చేస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక కోటగిరి గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,స్థానిక సింగిల్ విండో ఛైర్మెన్ కూచి సిద్దు గ్రామంలోని ప్రతి వాడవాడన తిరుగుతూ ప్రజలకు పలు రకాల సూచనలు చేస్తు,గ్రామంలో ఇండ్లు కూలిపోయిన రెండు కుటుంబాల వారికి ప్రభుత్వ భవనంలో షెల్టర్ ఏర్పాటు చేశారు.అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇండ్లు ఊరిస్తున్న ఐదు కుటుంబాలకు టార్పలిన్ పట్టాలు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలోతెల్లఅరవిం ద్,కన్నం సాయిలు,పాలగంగారాం,బొర్రసాయన్న, తదితరులు పాల్గొన్నారు.



