అత్యాచారా నిందితులకు 20 ఏళ్ల జైలు

కరీంనగర్‌,జూన్‌29(జనం సాక్షి): కరీంనగర్‌లో ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది. 2013 ఏప్రిల్‌ 18న బెల్లంపల్లికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. నిందితులు సురరాజ్‌ కుమార్‌, సవిూర్‌ లు కలసి రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ యువతిని నమ్మించి తీసుకెళ్లి ఈ కిరాతకానికి ఒడిగట్టారు. దీనిపై నిజాలు రుజువు కావడంతో తీర్పు చెప్పారు. ఈ కేసులో ఐదో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి నాగరాజు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.