అధికారులు పనితీరు మార్చుకోవాలి
మిషన్ భగీరథ ఆర్.ఎం.బి అధికారులపై అసహనం
ఎంపీపీ స్నేహ
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 5 : అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం చూపకుండా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ స్నేహం అన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు స్నేహ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ, శిశుసంక్షేమశాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, రెవిన్యూ, రోడ్లు భవనాలశాఖ, ఉద్యానవము తదితర శాఖల అధికారులు ప్రగతి నివేదికలను ప్రజా ప్రతినిధులకు చదివి వినిపించారు. అనంతరం రోడ్లు భవనాలశాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారుల పనితీరు పై సర్పంచులు ఎంపీటీసీలు అసహనం వ్యక్తం చేసి అధికారులను నిలదీశారు. అనంతరం ఎంపీపీ స్నేహ మాట్లాడుతూ అధికారులు చేసే పనికి జవాబుదారీగా ఉండాలని లేనిచో అభివృద్ధి సాధించలేమన్నారు. ముఖ్యంగా ఆర్ గార్లపాడుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణం పనులు ఎందుకు సాగడం లేదని నిలదీశారు. పనితీరు మార్చుకోకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. రోడ్లు భవనాలశాఖ ఏఈ మాట్లాడుతూ వచ్చే వేసవిలో తప్పకుండా బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సుజాత, జెడ్పిటిసి హనుమంతు రెడ్డి. సింగల్ విండో చైర్మన్ ఇ. రంగారెడ్డి, తాహసిల్దార్ సుబ్రహ్మణ్యం, మండల అభివృద్ధి అధికారి రాఘవ, విద్యాధికారి రాజు, వైద్యాధికారి సురేష్, ఆయా శాఖల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.