హనుమాన్ దేవాలయంలో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
శంషాబాద్, నవంబర్ 5 ( జనంసాక్షి )
కాంగ్రెస్ ప్రభుత్వంలో వరసగా విగ్రహాల ధ్వంసలు జరుగుతున్నాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్.
హిందూ సంఘాలు ఆందోళనలు.
ఎయిర్పోర్ట్ కాలనీ చుట్టుముట్టు భారీ బందోబస్తు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో మంగళవారం తెల్లవారుజామున నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. ఉదయాన్నే పూజ కోసం వచ్చిన అయ్యప్ప స్వాములు విగ్రహాలు ధ్వంసం అయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులుక్లూస్ టీం తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.డీసీపీ రాజేష్ మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం తెలియగానే పోలీసులు తమ బలగాలతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నమన్నారు. క్లూస్ టీం, క్రైమ్ టీం, సి సి ఫుటేజ్ కు సంబంధించిన టీం తో దర్యాప్తుకోన సాగిస్తున్నారు. దేవాలయ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తుకు ఆటంకాలు కలుగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఘటన స్థలానికి చేరుకున్న హిందూ సంఘాలు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయ ఆవరణలో ఆందోళనలు ధర్నాలు జై శ్రీరామ అంటూ నినాదాలు. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు, ఎయిర్పోర్ట్ కాలనీ చుట్టుముట్టు భారీ బందోబస్తు ఏర్పాటు, బయట వ్యక్తులను కాలనీ లోపలికి అనుమతించకుండా నాలుగు దిక్కులు భారీ బందోబస్తు. హనుమాన్ దేవాలయాన్ని మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఘటన స్థలాన్ని సందర్శించారు. బీజేవైఎం ప్రెసిడెంట్ మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలపై నిర్లక్ష్యం వహిస్తుంది. దేవాలయాలు విగ్రహాలపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.