అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎరువులు,విత్తనాలు సరఫరా చేయాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

టేకులపల్లి, జూలై 16( జనం సాక్షి):  ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మూలంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం టేకులపల్లి లో శనివారం జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైతు కూలీ సంఘం మండల కమిటీ లో  సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి  కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి  భారీగా కురిసిన వర్షాల వలన రైతులు వేసిన పంటలు ఎరువులు, విత్తన ములు నష్టపోయారని అన్నారు. విత్తనములు, మొలసిన మొక్కలు  వరదల మూలాన మట్టిలో కూరుకుపోయి తీవ్ర నష్టం వాటిలిందని అన్నారు. వ్యవసాయ రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విత్తనాలు ఎరువులు ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు  ఏట్టి నరసింహారావు,  అనంతుల శంకరాచారి,  లాకావత్ సజ్జన్,  గుగులోత్ సకృ,  ధరావత్ వెంకన్న, వినోద్,  సర్ప కృష్ణ,  లాకావత్ హనుమ,  జోగా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.