అన్నదాతలకు ఆత్మస్థైర్యం పెంచాలి
యంత్రాంగం కదలాలి.. రైతుల ఆత్మహత్యలు నివారించాలి
మైక్రో ఫైనాన్సులను గ్రామాల్లోకి అనుమతించకూడదు
మంత్రులు ఈటెల, కేటీఆర్ దిషానిర్దేశం
కరీంనగర్, సెప్టెంబర్ 8(జనంసాక్షి) : అన్న దాతలు ఆత్మస్థైర్యం కోల్పవద్దని, రైతులకు అండగా అధికారులు కదలాలి అని ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు వెంటనే పరిహరాన్ని చెల్లించాలంటూ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్. కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పావలా వడ్డీ, రైతులకు రుణాల విషయంతోపాటు కరువు పరిస్థితులను క్షుణ్ణంగా మంత్రులు ఇద్దరు సుమారు రెండు గంటలపాటు అధికారులు, బ్యాంకర్లతో సవిూక్షించారు.మైక్రోఫైనాన్స్ సంస్థలను గ్రామాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని అలాగే అప్పుల్లో కురుకు పోయిన రైతులను గుర్తించి వారికి భరోసా ఇవ్వలన్నారు. అనంతరం వారిద్దరు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి సహకరించకపోయినా తాము విూ పిడికిట్లో ఉన్నాం…ఇది విూ ప్రభుత్వం.. విూకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటుంది తప్ప ఇంకోటి కానే కాదని, ఎవ్వరు కూడా అధైర్య పడవద్దని అన్ని విధాలా ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోనే కాదు తెలంగాణాలోని ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీరు లేదని, సాగుసంగతి దేవుడెరుగు కాని తాగేందుకు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉన్న సందర్బంగా చేతనైనంతగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా 17వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీచేశామన్నారు. బ్యాంకర్లు రైతులనుంచి 4శాతంవడ్డీని బలవంతంగా వసూలు చేస్తున్నారనే అంశాన్ని కూడా పరిష్కరించడం జరిగిందని ఏ ఒక్క బ్యాంకర్ కూడా ఇకనుంచి ఆ వడ్డీని అడుగడని, ఇప్పటికే రైతులనుంచి తీసుకుని ఉంటే దానిని తిరిగి రైతులకిచ్చేస్తారని మంత్రి తెలిపారు. దీనికి సంబందించిన ఆదేశాలను బ్యాంకులకు కూడా జారీ చేశామని, అన్ని బ్యాంకులకు అందాయన్నారు. ఈసంవత్సరం 2400కోట్ల రుణాలు రైతులకు ఇవ్వాలని టార్గెట్‌గా బ్యాంకులు పెట్టుకున్నాయని, ఇందులో ఇప్పటివరకు 1350కోట్లను పంపిణీచేశాయన్నారు. మిగతావాటిని కూడా త్వరగా రైతులకు ఇవ్వాలని సమావేశంలో అధికారులను, బ్యాంకర్లను ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని సూచించామన్నారు. మండలస్థాయిలో జాయింట్ కమిటీలనే ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వడమేకాక, రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జేడీఎ, ఆరీ&ఢఓ, బ్యాంకర్లు, ఇతర అధికారులతో ఇప్పటికే రైతులకు భరోసా కల్పించేందుకు కమిటీలు వేయడం జరిగిందని రౌండ్‌ద క్లాక్ ఆబృందం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఎవ్వరికి ఏమస్య వచ్చినా కూడా వెంటనే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరించ వచ్చని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు. గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తులు అప్పులు తిరిగి చెల్లించేందుకు చేస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. ఆత్మహత్యలు ఎవ్వరరికి మంచివి కావన్నారు. ప్రభుత్వానికి భారం..భాధగా కూడా అవుతుందన్నారు. ఎన్నడు లేనటువంటి కరువు వచ్చిందని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విూకు అండగా ఉంటుందన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు గాను సేవలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న నాలుగు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు దారులందరికి కొత్తగా రుణాలివ్వాలని, ఈ పథకం కిందకు రాకుండా ఉన్న 2 లక్షల మందిని కూడా చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు.కమతం ఆధారంగా కాకుండా రైతులకు ఎక్కువమొత్తంలో ఉదారంగా రుణాలివ్వాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. రైతులకు ఇప్పటికే ఉన్న మహిళా సౌభాగ్య, కిసాన్ సురక్ష పథకాలను విస్తృతంగా గ్రామగ్రామానికి తీసుకెల్లాలన్నారు. జిల్లాలోని 57 మండలాల్లో 47 మండలాల్లో సాధారణం కంటే కూడా తక్కువ వర్షాపాతం నమోదైందని తెలిపారు. కరువును ఎదుర్కొనేందుకు జిల్లాలో అదనంగా 5వేల పాడి పశువులు పశు సంవర్థక శాఖ ద్వారా రైతులకు ఇప్పించి ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.జిల్లాలో ఇటీవల జరిగిన రైతు అత్మహత్యల్లో 13 మందికి ప్రభుత్వ ప్యాకేజీ సహాయం అందించడం జరిగిందని, మరో 8 పెండింగ్‌లో ఉన్నాయని వారికి కూడా వారంలోపే సహాయం అందిస్తామన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 1.50లక్ష ప్యాకేజీని పెంచాలని భావిస్తున్నామని, అయితే ఇలా చేయడం వల్ల చెడు మార్గం చూపించినట్లవుతుందేమోననే భయంకూడా తమ ప్రభుత్వానికి ఉందన్నారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే 7, 8 రకాల సేవలను విస్తరించామన్నారు. రానున్న ఖరీఫ్ నాటికి 9 గంటల పగటి పూట విద్యుత్ పంపిణీ చేసేందుకు అవసరమైన 33/11 కేవి సబ్‌స్టేషన్లు 115, 132/33 కెవి సబ్‌స్టేషన్లు 5 నిర్మించే పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. వీటికోసం 650 కోట్లను వెచ్చిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి రోజు యుద్దంగా భావించి నిర్మాణాలు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ కొత్త బోర్లు వేసే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే ఉన్న వాటిని లోతు పెంచడం, దాని ప్రక్కనే మరో సోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఎక్కడ వీలైతే అక్కడ వ్యవసాయ భావులను కిరాయికి తీసుకుని నీటిని అందించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఏది వీలుకాని పరిస్థితి ఉంటే రవాణా ద్వారా నీటిని అందించాలన్నారు.రైతులు ఏమాత్రం అధైర్య పడకూడదని, ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు ఏమాత్రం పరిష్కారం కానే కావన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తులఉమ, కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, నగరమేయర్ సర్దార్ రవిందర్ సింగ్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.