అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖి పండుగ
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 12
దేశవ్యాప్తంగా ప్రజలు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సోదరా సోదరీమణులు ప్రేమకు చినహమైన ఈ రాఖి పండుగను అంతే ప్రేమతో జరుపుకుంటారు. ఈ పర్వదినం రోజున ప్రతి సోదరీ తన సోదరుడి చేతికి రాఖీ కట్టివారిఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతారు. అలాగే ప్రతి సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటానని భరోసా ఇస్తారు. హిందూ పండుగలలో రాఖీ పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు. అక్క చెల్లెలంతా బుద్ధిగా కూర్చున్న అన్న తమ్ములకి రాఖీ కడతారు. చెల్లి తన అన్నయ్య మహోన్నతమైన శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖి అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగను శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. అంతేకాదు ఇతిహసాల ప్రకారం ద్రౌపతి శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశు బాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతోందట. అది గమనించిన ద్రౌపతి తన పట్టుచీర కొంగు చింపి వేలుకు కట్టు కట్టిందంట. దానికికృతజ్ఞతగా
ఎల్లవేళల అండగా ఉంటానని శ్రీకృష్ణుడి చెల్లెలు ద్రౌపతికి హామీ ఇచ్చారు. ఇదే రాఖి కి అన్న చెల్లెల అనుబంధం అని అంటారు.