అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు గొరిటాల మురళి (48) ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలు తీవ్రం కావడంతో మరమగ్గాలపై  ఆధారపడి పనిచేస్తున్నమురళి ఉపాధి కోల్పోయాడు. అప్పులబాధతో పాటు, కుటుంబ పోషణ భారం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.