అభివృద్దిలో కోరుట్ల ముందంజ: ఎమ్మెల్యే

కోరుట్ల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): తెలంగాణలో నలభై ఏండ్ల అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే మిషన్‌ భగీరథ పనులు పూర్తయి ఇంటింటికీ మంచినీరు అందబోతున్నదని అన్నారు. కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించామని వివరించారు. నాలుగో విడతో భాగంగా గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. హరితహారంలో అగ్రభాగాన నిలిచిన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తానని హావిూ ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా అందరూ మొక్కలు నాటాలన్నారు.