అభివృద్ది లో మహాదేవపూర్ సహకార సంఘం

చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి..

మహాదేవపూర్. సెప్టెంబర్21 (జనంసాక్షి)

మహాదేవపూర్ వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని సంఘం చైర్మెన్ చల్ల తిరుపతయ్య అన్నారు, బుధవారం నాడు చైర్మన్ తిరుపతయ్య అధ్యక్షతన వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు, ఈ సంవత్సరం గాను రైతులకు పంట రుణాలు కోటి వరకు ఇచ్చామని మరో50 లక్షల రూపాయల కోసం ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. రబీ సీజనల్ లో 20306క్వింటాన్ల వరి ధాన్యం సేకరించమని దానిపై3కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని ఆయన వివరించారు. క్రాఫ్ లోన్లు 6కోట్ల2లక్షలు.బంగారం రుణాలు4కోట్ల60లక్ష లు.చిరు వ్యాపారులకు46 లక్షల99వేలు, మహిళా సంఘాలకు19లక్షల80 వేలు, మొత్తంగా రుణాల రూపకంగా11కోట్లకు పైగా ఇచ్చినట్లు తెలిపారు. వడ్ల కొనుగోలులో కటాఫ్ చేయకుండా చూడాలని రైతులు కోరగా మిల్లు యజమానులతో మాట్లాడుతానని తెలిపారు. పలిమేల మండలంలోని చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని డైరెక్టర్ శ్రీనివాస్ కోరగా తప్పకుండా పలిమేల మండలంలో కొంతమందికి ఇప్పటికే రుణాలు ఇవ్వడం జరిగిందని మిగితా వారికి రుణాలు ఇస్తామని చైర్మన్ తిరుపతయ్య తెలిపారు. రైతులు ప్రజల సహకారంతో మహాదేవపూర్ వ్యవసాయ సహకార సంఘం 44 లక్షల నికర లాభాలతో వున్నదని ఆయన తెలిపారు. మండలం కేంద్రంలో పిట్రోల్ పంపు, వాటర్ ఫ్లాన్ ట్, ఏ సి గోదాములనిర్మాణం కొరకు తీర్మానాలు చేసినట్లుగా వివరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా సహకార అధికారి మద్ది లెట్టి,జడ్పీటీసీ గుడాల అరుణా, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు,సంఘం డైరెక్టర్లు ఏం డి ఇబ్రహీం, సమ్మయ్య, సుధాకర్, కృష్ణా కార్, సుమన్, కలుగురి సమ్మక్క, పీర్ల శ్రీనివాస్, మాజీ సంఘం అధ్యక్షులు, వామాన్ రావు, బ్రమ్మనపల్లి సర్పంచ్ నర్సింగరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.