అమరత్వానికి అటూ ఇటూ

(మంగళవారం తరువాయి భాగం)
ఇక ‘ఎన్‌కౌంటర్‌’ వివరాల్లోకి పోతే, సిపిఐ మావోయిస్టు ఉత్తర తెలంగాణ అధికారి ప్రతినిధి జగన్‌ ప్రకటన ప్రకారం ‘ఛత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లా పువ్వర్తిలో ‘ఎన్‌కౌంటర్‌’ ఏకపక్షంగా జరిగింది. ఇన్‌ఫార్మర్‌,  కోవర్టులపై ఆదారపడి ఈనెల 16 తేదీన యునిఫైడ్‌ కమాండ్‌ ఫోర్స్‌ పేరుతో మూడువేల ఎపి గ్రేహౌండ్స్‌ బలగాలు కెకెడబ్ల్యూ (ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌) దళంపై నరహంతక దాడి జరిపారు. ఇది ఏకపక్షం ఈ దాడుల్లో అమరులైన తొమ్మిందిమంది
1)మర్రి రవి(38)సుధాకర్‌ కెకెడబ్ల్యూ కార్యదర్శి, ఉత్తర తెలంగాణ స్పెషల్‌జోనల్‌ కమిటీ సభ్యుడు. సీతారాంపురం గ్రామం. ఘనపురం (ములుగు) మండలం. యాదవ కుటుంబంలో పుట్టిన రవి 18వ ఏటనే విప్లవోద్యమంలోకి వచ్చి ప్రజాప్రతిఘటన పార్టీనుంచి మావోయిస్టు పార్టీలో చేరి దళసభ్యుని స్ధాయినుంచి అంచెలంచెలుగా రాష్ట్రస్థాయి నాయవత్వానికి ఎదిగాడు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. రాజకీయస్పష్టతకు, నైశిత్వానికి పెట్టిందిపేరు.
2) గుగ్లోతు లక్ష్మీ(32) పుష్ప ` జిల్లా కమిటీ సభ్యురాలు రామపురం, భూపాలపల్లి మండలం లంబాడీ కుటుంబంలో పుట్టి 10వ ఏట నుంచే విప్లవోద్యమంలోనే పెరిగి సుధాకర్‌ను పార్టీలోనే పెళ్లి చేసుకొని 2007లో బయటికి వచ్చి పిల్లవాణ్ని కని సుధాకర్‌ చెల్లెలికి పెంచుకోవడానికిచ్చి మళ్లీ అజ్ఞాతంలోకి  వెళ్లిపోయింది. మూడు సంవత్సరాల క్రితం అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్‌ సింగన్న అమరుడు కాగా పుష్పక్క బుల్లెట్‌ గాయంతో తప్పించుకుంది. గెరిల్లా యుద్దంలో ఆరితేరిన యోధురాలు.
3)ఎట్టి నర్సక్క(33) సబిత ` జిల్లా కమిటి సభ్యురాలు. గోగుపల్ల ఏటూరు, నాగారం మండలం, కోయ కుటుంబంలో పుట్టింది. అమరుడు బడే నాగేశ్వరరావు సహచరి, మహదేవపూర్‌, ఏటూరు నాగారం కార్యదర్శి.
4)బడే ఊర్మిళ(24)దళ సభ్యురాలు కాల్వపల్లి ఏటూరు నాగారం మండలం కోయ బడే నాగేశ్వరరావు చెల్లెలు, ఈ కుటుంబం నుంచి అప్పటికి ముగ్గురు అమరులయ్యారు.
5) ఆరెల్లి వెంకట్‌(35) గౌతమ్‌, కిరణ్‌, ఏరియా కమిటీ సభ్యుడు కరీంనగర్‌ జిల్లా కానాపురం, మంధని మండలం ప్లాటూన్‌ కమాండర్‌.
6) అజయ్‌(20) కాశెట్టిపాడు సభ్యుడు మాదిగ
7) జనగామ రాజు ` దుర్గం రాజు(26)సేతగాని మాల, బుట్టాయగూడెం , ఏటూరు నాగారం మండలం కమాండర్‌.
8) మద్దిసీత ` నవత, పూరేడిపల్లి, మంగపేట మండలం సభ్యురాలు.
9) వసంత ` అన్నారం రాళ్లగూడెం దగ్గర బీజాపూర్‌ మండలం దేవాదులకు దగ్గరవుతుంది.
‘ఈ ఏకపక్ష దాడియే కాకుండా పువ్వర్తి, జబ్బగుట్ట , మర్కనగూడెం, మెట్లగూడెం గ్రామలపై ఏపి గ్రేహౌండ్స్‌ బలగాలు దాడులు చేసి ఇళ్లలోకి బొరబడి ధాన్యం, విలువయిన సామాగ్రి ధ్వంసం చేసి, ప్రజలను దోచుకున్నారు. ఆయా గ్రామాలలో ఆదివాసీలను కొట్టి చిత్రహింసలు పెట్టి ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక ఆదివాసీ కేడర్‌ మధ్య విభేదాల కారణంగా సమాచారం బయటికి పొక్కడంతో పోలీసులు దాడి చేశారు. పోలీసు అధికారులు, పాలకవర్గాలు మీడియా ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. తొమ్మిది మంది కామ్రేడ్లను చంపి కెకెడబ్ల్యూ ఖతం అని విర్రవీగుతున్నారు.
ప్రజల బిడ్డలను చంపినందుకు ప్రజలు, ప్రజా గెరిల్లాలు పోలీసు అధికారిని ఖతం చేసారు. అయితే అతడు 17న చనిపోయాడు. ఆర్‌ఎస్‌ఐని క్రూరంగా చంపినట్లు తెలుగు మీడియాలోనూ, ముఖ్యంగా రెండు ప్రముక తెలుగు దినపత్రికలు (ఆంధ్రజ్యోతి, ఈనాడు) వచ్చిన వార్తలు అబద్దం. ప్రతిఘటన సందర్బంలో లోకల్‌ మిలీషియా చేతిలో సంప్రదాయ ఆయుధాలతో జరిపిన దాడిలో అతడు చనిపోయాడు.  పోలీసుల ఆధీనంలో ఉన్న ముప్పై మంది ఆదివాసులను వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి. అమరులయిన తొమ్మిది మంది కామ్రేడ్లు తెలంగాణ విముక్తి కోసం, దేశంలో, ప్రపంచంలో దోపిడీ లేని నవసమాజం కోసం రక్త సంబంధీకులను, రాష్ట్రాలను వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేశారు. ప్రజల కోసం పోరాడారు.  ప్రజల కోఎసం ప్రాణాలర్పించారు. వీరి స్థానాలను తప్పకుండా యువతీ యువకులు భర్తీ చేస్తారు. అమరుల తల్లిదండ్రులకు, రక్త బంధువులకు విప్లవ వందనాలు. ఈ తొమ్మిది మంది అమరుల్లో ఏడుగురు వరంగల్‌ జిల్లా వాళ్లే అందులోను ఘనపురం (ములుగు) భూపాలపల్లి, కాల్వపల్లి, ఏటూరు నాగారం వంటి గోదావరి లోయ ఆడివంచు ఊళ్లు. ఆ విధంగా చూసినపుడు కరీంనగర్‌ జిల్లా మంథని దగ్గరి కానాపురం కూడా ఆడివంచు ఊరు అటు చత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లా వసంతదయినా దేవాదుల దగ్గరి అన్నారం తాళ్లగూడెం దగ్గరి  ఊరు ` వరంగల్‌ జిల్లా సరిహద్దు గ్రామమే ఈ తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు ముప్పై రెండేళ్ల  కన్నాతక్కువ వయసు వాళ్లు అందరూ ఆదివాసులు, దళితులు. ఆదివాసుల్లో ఎక్కువగా కోయలు, దళితుల్లో మాదిగలు,మర్రి రవి అణగారిన వెనుకబడిన కులం నంచి వస్తే మిగతా పురుషులు కూడ దళితులు. ఈ అందరికీ గోదావరి లోయ, అడవి, అడవిలోని ఆదివాసీ జీవితాలు, పోరాటాలు తప్ప వేరే ‘నాగరిక’ ప్రపంచం తెలియదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ, జగిత్యాల పోరాటాల వారసత్వంగా ఈ ఏజెన్సీ ఏరియాలో వీళ్లు తెరిచిందీ, పెరిగిందీ, ఎంచుకున్నదీ, ప్రాణాలర్పించిందీ విప్లవోద్యమంలోనే.  ఒక విధంగా చూసినపుడు ఇది ఉత్తర తెలంగాణ మూడు జిల్లాల విప్లవోద్యమానికి తీవ్ర నష్టంగా కనిపించినా మరొక విధంగా చూసినపుడు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమం సెట్‌బ్యాక్‌ తర్వాత పునర్నిర్మాణమవుతున్న ఉద్యమంలోకి ఎంతగడ్డి వేళ్ల స్థాయి నుంచి, విప్లవకర వర్గాల నుంచి శ్రేణులు వస్తున్నారో ఇది ఎటువంటి పరిణతియోనని ఎక్కడలేని విశ్వాసం కలుగుతుంది. వాళ్లకింకా విప్లవం తప్ప మరొక జీవితం లేదు. అడవి తప్ప నీడ లేదు. ప్రజలు తప్ప ఒడి లేదు. అమరులై వాళ్లు తల్లిదండ్రులు తెచ్చుకుంటే తమ ఊళ్లకు వచ్చారు. గానీ సరిహద్దులు చెరిపేసి వాళ్లే దండకారణ్య విప్లవోద్యమం తల్లి ఒడిలో తమ శ్వాస, ధ్యాస, జీవితం, పోరాటంగా కలిసిపోయారు. తాను వరంగల్‌ రాజధానిగా పాలించిన కాకతీయులకు వారసున్నని, తమ పూర్వీకులు ఆరు వంద సంవత్సరాల క్రితం బస్తర్‌కు రాజులుగా వచ్చారని చెప్పుకున్న వ్రవీర్‌ చంద్ర బాంజ్‌దేవ్‌ 1965లో తన అత్మకథలో నేనను కాంగ్రెస్‌ పార్టీని వలస పాలకులుగా నిందించాడు. ‘ఈ ప్రభుత్వ విధానాలు పారిశ్రామికీకరణ, ఆధునికీకరణతో పాటు కాంట్రాక్టర్ల సంక్షేమం (ఆదివాసులకు వ్యతిరేకంగా), ఈ కుట్ర అంతం కావాలి. ఒక ఆదర్శప్రాయమైన, సమానత్వాన్ని ఇవ్వగల వ్యవస్థలోకి ప్రజల్ని నడిపించడంలో ఘోరంగా విఫలమాయ్యారు. అందుకే ఈ (కాంగ్రెస్‌) పరిపాలనను నామరూపాలు లేకుండా అంతం చేయాలి’ అని రాసుకున్నాడు. ‘ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా’ ఆదివాసులతో కలిసి ‘యుద్దాన్ని’ ప్రకటించడానికి, అందుకే ఆయనకు బుద్ది చెప్పడానికి 1966 మార్చ్‌ 26న ఆయన రాజప్రసారంపై దాడి చేసి పోలీసులు ఆయనను చంపేసారు. ఆదాడిలోపన్నెండు మంది ఆదివా సులు కూడా చనిపోయినట్లు ప్రకటించినా అంతకన్న పెద్ద సంఖ్యలోనే చనిపోయి ఉంటారని ‘దండకారణ్య సమాచార్‌’ అనే పత్రిక రాసింది. తెలుగు రాజు కాకతీయులకు ప్రవీర్‌చంద్ర వారసుడైనట్లే ఇవ్వాళ తెలుగు మాట్లాడే మావోయిస్టులకు ప్రవీర్‌ చంద్ర వారసత్వం ఉందా? అని ఒక ప్రభుత్వాధికారి అన్నాడట. బ్రిటిష్‌ సాÊంరమాజ్యవాదాన్ని ప్రతిఘటించిన రాంజీగోండు గోండురాజు రాజు గోండు అయినా, సామ్రాజ్యవాద దళారీ కాంగ్రెస్‌ పాలనను ప్రశ్నించిన గోండు రాజు ప్రవీర్‌ చంద్ర అయినా, భూంకాల్‌ మిలీషియాను నిర్మించి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంతో పోరాడిన గూండాధర్‌ మొదలు, ‘మా ఊళ్లో మా రాజ్యం’ అని బ్రిటిష్‌తో, నైజాంతో తలపడిన కొమురం భీము వరకు దేశభక్తులయిన స్థానిక ఆదివాసీ రాజుల, పోరాట ప్రజల వారసులే పెద్ది  శంకర్‌ మొదలు సుధాకర్‌ వరకు మావోయిస్టు విప్లవకారులు.  ఆ మృతదేహాలను గ్రేహౌండ్స్‌ హెలికాప్టర్‌లో బుధవారం 17న తెచ్చారు. అది మనుషుల పట్ల, మృతదేహాల పట్ల గౌరవంతో కాక అందులో విప్లవోద్యమ అగ్ర నాయవత్వం, కేంద్ర కమిటీ ప్రముఖ నాయకులు