దేశీయంగా ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాల తయారీ

– అగ్రరాజ్యాల సరసన భారత్‌
` డీఆర్‌డీవోతో మరో భారీ ఒప్పందం
` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్‌ఫైటర్ల తయారీ
స్వదేశీ ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాల తయారీ కార్యరూపం దాల్చే దిశగా మరో అడుగుపడిరది. ప్రొటోటైప్‌ ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా డీఆర్‌డీఓతో కలిసి పనిచేసేందుకు ఏడు దేశీయ కంపెనీలు బిడ్డింగ్‌ దాఖలుచేశాయి. రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 ఐదోతరం స్టెల్త్‌ జెట్‌ ఫైటర్లను తయారు చేయనున్నారు. దీంతో భారత్‌ అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనాల సరసన చేరనుంది.డీఆర్డీవో సారథ్యంలో ఐదో తరం స్టెల్త్‌ యుద్ధ విమానాల అభివృద్ధి కోసం ప్రారంభమైన ఏఎమ్‌సీఏ ప్రాజెక్టులో ముందడుగు పడిరది. ఏఎమ్‌సీఏ ప్రొటోటైప్‌ నమూనాల రూపకల్పన, అభివృద్ధి కోసం 7 భారతీయ కంపెనీలు డీఆర్‌డీవోతో కలిసి పనిచేసేందుకు బిడ్డింగ్‌ దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 125 ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలను డీఆర్‌డీవో భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. ఎల్‌ అండ్‌ టీ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, అదానీ డిఫెన్స్‌ తదితర సంస్థలు బిడ్డింగ్‌ దాఖలు వేశాయి. ఆ బిడ్లను మాజీ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చీఫ్‌ ఎ.శివథాను పిళ్లై నేతృత్వంలోని కమిటీ పరిశీలించి రక్షణశాఖకు నివేదించనుంది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన రెండు కంపెనీలను రక్షణశాఖ తుది ఎంపిక చేయనుంది. ఇద్దరు బిడ్డర్లకు రూ.15వేల కోట్ల విలువైన పనులు అప్పగిస్తారు. రూ. 2లక్షల కోట్ల ఏఎమ్‌సీఏ ప్రాజెక్టులో భాగంగా 125 ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలు తయారు చేయనున్నారు. 2035 నాటికి అవి వాయుసేనలో చేరే అవకాశం ఉంది.ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలను తయారు చేస్తే భారత్‌ అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యా సరసన చేరుతుంది. ఇప్పటివరకు అమెరికా ఎఫ్‌- 22, ఎఫ్‌- 35, చైనా జే- 20, రష్యా ఎస్‌యూ- 57 ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలు కలిగి ఉన్నాయి. భారత్‌ తయారు చేసే తొలి ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలు సింగిల్‌ సీట్‌, రెండు ఇంజన్లు కలిగి ఉండనున్నాయి. ఇవి అమెరికా, రష్యాకు చెందిన ఎఫ్‌- 22, ఎఫ్‌- 35, ఎస్‌యూ- 57 మాదిరిగా అడ్వాన్స్‌డ్‌ స్టెల్త్‌ కోటింగ్‌తో పాటు అంతర్గత ఆయుధాలు కలిగి ఉండనున్నాయి. వాటి ఆపరేషనల్‌ సామర్థ్యం 55వేల అడుగులు కాగా అంతర్గతంగా 1,500కిలోలు, బాహ్యంగా 5,500కిలోలు ఆయుధాలను మోసుకెళ్లగలవని అంచనా. ఏఎంసీఏ మరో 6,500కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో రెండు వెర్షన్ల ఇంజిన్లు ఉంటాయని తెలుస్తోంది. రెండో ఇంజిన్‌ను భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేయనుంది. అది అమెరికా తయారీ జీఈ 414 మొదటి ఇంజిన్‌ కంటే శక్తివంతంగా ఉంటుందని అంచనా. మొత్తంగా ఇది సూపర్‌ మ్యానోవ్రబుల్‌, స్టెల్తీ మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్‌ కానుంది.