3 శాతం డీఏ పెంపు

` కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ కేబినెట్‌ ఆమోదం
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడిరచారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (ఆం)ను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ కరవు భత్యాన్ని అందజేస్తారు. 3శాతం పెంపు నిర్ణయంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరనుంది. 49 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులు లబ్ది పొందనున్నారు.ఇదిలాఉంటే.. దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 78 రోజుల వేతనాన్ని ’ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌’ (ఖఒః) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ డీఏ పెంపుతో పాటు క్యాబినెట్‌ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. రూ.5,863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం సమృద్ధికి ఆమోదం ఇచ్చింది.