దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం
` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు
న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) స్థాపించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ స్కూళ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 5,863 కోట్లు కేటాయించింది.ఇందుకోసం రూ.5863కోట్లు కేటాయించనుంది. వాటిల్లో ఏడు కేంద్రియ విద్యాలయాల నిర్మాణం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..మిగిలిన 50 కేవీ స్కూల్స్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందుబాటులోకి రానున్నాయి.తాజాగా కేంద్రం ప్రకటించిన 57కేవీ స్కూల్స్‌లలో ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయం లేని 20 జిల్లాల్లో కేంద్రం స్థాపించనుంది. మిగిలిన 14 అభివృద్ధి చెందాల్సిన జిల్లాల్లో, నాలుగు ఎల్‌బ్ల్యూఈ అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, మిగిలిన ఐదు విద్యాలయాలు ఈశాన్య రాష్ట్రాలు పర్వత ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేంద్రియ విద్యాలయాలు 17 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థాపించనుంది.దీంతో పాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచింది. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర భారత్ కింద పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రూ. 11,440 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని క్వాలిటీ సీడ్స్, ట్రైనింగ్, మౌలిక వసతుల పెంపు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు , ధర స్థిరీకరణ నిధి తదితర అంశాలపై కేంద్రం ఖర్చు చేయనుంది.రబీ సీజన్లో పంటలకు మద్దతు ధర కోసం రూ. 84,263 కోట్ల రూపాయలు కేటాయింపు. గోధుమకు రూ.2,585 రూపాయలు, బార్లీ రూ. 2150, శనగపప్పు రూ.5875, ఎర్ర పప్పు రూ.7000, ఆవాలు రూ. 6200, కుసుమ రూ. 6540 కేటాయించింది. కలియ బోర్ నుంచి నుమాలీఘర్ సెక్షన్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6957 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్ 3 కి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. ఈ ప్రాజెక్టులో 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వందేమాతరం గేయం 150 సంవత్సరాల ఉత్సవాలకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా – జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా – నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లో.. నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయని కిషన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు చెప్పారు.గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.2వేల కోట్లు కేటాయించిందని వివరించారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.