అమరత్వానికి అటూ ఇటూ
రాజ్యం ఒకవైపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతూ,
మరోవైపు అబద్ధపు ప్రచారాలతో అమరుల త్యాగాలను మసకబార్చడానికి ప్రయత్నిస్తొందని అంటున్నారు. వరవరరావు
అయినా భద్రాచలం పోలీసు అధికారులు మొదలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు రక్త బంధువుల ఈ అభ్యర్ధనను పెడచెవని పెట్టింది. బేఖాతరు చేసింది. హైకోర్టు ఉత్తరు8్వలతో వెళ్లిన ఎపిసిఎల్‌సి, ఇతర ప్రజా సంఘాల నాయకులను, న్యాయవాదులను, అమరుల బంధు మిత్రల సంఘ నాయకులను, ప్రజాస్వామ్యవాదులను, మృతదేహాల పరిసరాలకు రానివ్వలేదు. తోసివేశారు. చాల తృణీకార భావంతో వ్యవహరించారు. హైకోర్టు ఉత్తర్వుల నెపం చెప్పారు తప్ప ఉదయం తొమ్మిది గంటల లోపల మృతదేహాలను రక్త బంధువులకు చూపాలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును గౌరవించలేదు. పాటించలేదు. పైన పేర్కొన్న ప్రజాసంఘాల నాయకలు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు. ఆసుపత్రిలో అమరుల ఆఖరిచూపు కోసం వచ్చిన వందలాది మంది ప్రజలు నిరసనల వల్ల , తీవ్ర స్పందన వల్ల మాత్రమే ఉదయం తొమ్మిది గంటల తర్వాత మృతదేహాలను రక్త బంధువులనుచూడనిచ్చారు. మృతుల కుటుంబాల పట్ల, ప్రజాస్వామిక హక్కుల పట్ల న్యాయం కోసం చట్టాలను గౌరవించడం కోసం న్యాయవాదులు చేసిన పోరాటం వల్ల పోలీసులకు ఎంత అక్కసు ఉన్నదనడానికి నిదర్శనమే ఆర్‌ఎస్‌ఐ మృతదేహం తాము పెట్టిన గడువులోపల అప్పగించకపోతే ఎపిసిఎల్‌సి సంయుక్త కార్యదర్శి రఘనాథ్ (అడ్వకేట్), ఆయన భార్య శిరిష (టీచర్), పిల్లలను, సిఆర్‌పిపి కార్యదర్శి బల్లా రవీంద్రనాథ్ (అడ్వకేట్), ఆయన భార్య సిఆర్‌పిపి కమిటి సభ్యురాలు అవ్వకేట్‌లను చంపేస్తామన్న బూతులతోకూడిన బెదిరింపు ఫోన్‌కాల్స్.
ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్‌తో నిమిత్తం లేకుండానే ఆర్‌ఎస్‌ఐ మృతదేహం అడవిలో చెరువు పక్కన పడి ఉన్నదని మీడియా ద్వారా తెలుసుకున్న ఎపిసిఎల్‌సి అధ్యక్షుడు ప్రాఫెసర్ శేషయ్యగారు ఆర్‌ఎస్‌ఐ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని విజ్ఞప్తి చేసే ఉన్నాడు. ఎపిసిఎల్‌సి గానీ, ప్రజాస్వామ్యవాదులు గానీ ఎవరో అడిగారని, ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని, విజ్ఞప్తి చేశారని కాకుండా ప్రజాస్వామిక విశ్వాసాల వల్లనే మొదటి నుంచీ ఎవరి మృతదేహులైనా వారి కుటుంబాలకు అప్పగించాలనే సూత్రబద్దమైన వైఖరి తీసుకున్న వాళ్లే. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆర్‌ఎస్‌ఐ మృతదేహంతో పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి శవరాజకీయాలు చేసిందో గమనిస్తే ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ‘ఎన్‌కౌంటర్’ గురించి మీడియాలో వార్తలు వచ్చిన 17వ తేదీ సాయంత్రానికి పరస్పర భిన్నమైన కథనాల వలన ప్రొ శేషయ్య గారు జస్టిస్ దేశాయ్, ఎన్‌హచ్‌ఆర్సీ నిర్ధేశక సూత్రాలకు అనుగుణంగా మృతదేహాలను భద్రపరిచి, రీపోస్ట్ మార్టం జరిపించాలని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు చీఫ్ జస్టిస్ ముందు హౌజ్ మోషన్ చేశారు. హైకోర్టు అదే రాత్రి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి గారినిఈ రిట్ మీద విచారించాల్సిందిగా నిర్దేశించింది. ఆ న్యాయమూర్తి ముందు అందుబాటులో ఉన్న సమాచారం పెట్టడానికి నెట్ నుంచి మృతదేహాల ఫోటోలు తీసినప్పుడు ప్రతి మృతదేహం నుదుటి మీద తుపాకి మడమలతో కొట్టిన దెబ్బలు, నెత్తురు కదుములు కట్టినట్టుగా ఉంది. అట్లె ఆసిడ్ పోసినట్టుగా నుదురు, చెంపలు, ఇతర భాగాల చర్మం కాలి ఊడి వచ్చాయి. శరీరాల నిండా గాయాలున్నాయి. కనుక ఏదైనా ఆహారంలో మత్తు కలపడమో, కొవర్టు ప్రయత్నంలో విషాహారం ఇవ్వడమో జరిగి వాళ్లు సొమ్మసిల్లి ఉంటారని అప్పటికి ఊహించిడమైంది. భద్రాచలంలో మృతుల కుటుంబాలు మృతదేహాలు చూసిన తర్వాత వెలుబుచ్చిన అనుమానాలకు కూడా మీడియాతో ఒకమారు నేను అనుమానం వెలిబుచ్చాను. ఇది ధృవపడిన వార్త కాదు. 19న శుక్రవారం చత్తీస్‌గడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ ఢల్లీిలో ఉన్న బిడి శర్మ గారికి ఫోన్ చేసి 18న సప్లైస్‌కు వెళ్లిన హెలికాప్టర్ తిరుగు ప్రయాణంలో ఒక పోలీసును వదిలివేసిదని, అతను డీహైడ్రెట్ అయి చనిపోయాడని, అతని మృతదేహం చుట్టూ గ్రామస్తులున్నారని, ఆ మృతదేహాన్ని మృతుని కుటుంబానికి అప్పగించాలని విజ్ఞప్తి చేయమన్నారు. అటువంటి ఏర్పాటేదో చేయమని బిడి శర్మ గారు నన్ను కోరారు. అడవిలో ఉన్న వారికి సమాచరం అందే అవకాశం బిబిసి హింది వార్తలు, ఆకాశవాణి ప్రాంతీయ వార్తలే కనుక, బిబిసి వాళ్లు కూడా ఆసక్తి చూపినందున ఆ ఏర్పాటు చేశాను. నేను కూడా బిబిసి వాళ్ల కోరికపై ఈ విషయాలే టైమ్స్ నౌకు చెప్పాను. 18న ఢల్లీిలో ఉన్న ప్రొ హరగోపాలతో కలిసి బిడి శర్మగారి ఇంట్లో ఎన్‌డిటివి ఇంటర్వ్యూ చేసింది. 19న మళ్లీ ఢల్లీిలో ప్రొ హరగోపాల్ ప్రకటనను బిబిసి హిందీ రికార్డు చేసి ప్రసారం చేసింది. ఇట్లా మూడు రోజులు అడవలో ఆర్‌ఎస్‌ఐ శవం పడి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా చత్తీస్‌గడ్ ప్రభుత్వం బిడి శర్మ గారి వంటి వాళ్ల దగ్గరికి అడవిని వాళ్ల విజ్ఞప్తిని చేరవేయగల ఆకాశవాణి వంటి ప్రసార సాధనాలను పంపించే ఏ ఏర్పాటు, ప్రయత్నమూ చేయలేదు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను, చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లా కలెక్టర్ పాల్ ఎక్స్ మీనన్‌లను మవోయిస్టులు బందీలుగా తీసుకున్నప్పుడు ఆయా ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలతో ఒక్కసారి ఈ ఆర్‌ఎస్‌ఐ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకిప్పించే విషయంలో చేసిన జాప్యాన్ని నిర్లక్ష్యాన్ని పోల్చుకొని చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ప్రయత్నమూ చేయకపోగా ఎట్లాగూ వచ్చిన వాడు ఆర్‌ఎస్‌ఐ పైగా ఏం చేసినా మళ్లీ ప్రాణాలతో తిరిగిరాడు
కనుక ఆతని శవం కుళ్లి పురుగులు పడి ఏమైనా కానీ శవ ఆజకీయాలు చేయాలని పధకం వేసుకున్నారు. ఇంకా ఎన్ని అబద్దాలు ప్రనచారం చేసారు. అంతేకాదు 16న జరిగింది నిజమైన ఎన్‌కౌంటర్ అనడానికి ఈ ఆర్‌ఎస్‌ఐ ఆ ఎన్‌కౌంటర్‌లోనే మరణించాడని ప్రచారం చేసారు. ప్రతీకారంతో ఈ ఆర్‌ఎస్‌ఐని చంపి శవం చుట్టూ మందుపాతరలు పెట్టారని ప్రచారం చేసారు. దమ్ముంటే వచ్చి మీ ఆర్‌ఎస్‌ఐ శవాన్ని తీసుకపోండి అని సవాల్ విసిరారని ప్రచారం చేసారు. ఈ ప్రచారంలో పోలీసు పాత్ర ఎంత, మీడియా పాత్ర ఎంత అనేది చెప్పడం కష్టం. కేంద్ర కమిటీ ప్రముఖ నాయకులు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారన్న దగ్గర్నించీ, హెలికాప్టర్‌ను కూల్చివేయడం దగ్గర్నించీ, మండుపాతరలు, సవాళ్ల వరకు తాము చూసినట్లు, విన్నట్లు, ప్రత్యక్ష ప్రసారాల వలె, కొన్ని పాత క్లిప్పింగులను టెక్నికల్ ట్రిక్కులను అక్కడ ఎన్‌కౌంటర్ జరుగుతుంటే, హెలికాప్టర్‌పై కాల్పులు జరుపుతుంటే, శవం చెరువు పక్కన పడి ఉంటే ఫోటోలు తీసి ప్రసారం చేసినట్లుగా ప్రసారం చేసాయి. అంతా అయిపోయాక ఒక ప్రముఖ దినపత్రిక కళ్లు పీకేసీ, చేతులు నరికేసి ఆర్‌ఎస్‌ఐని చంపారని ఒక ఫోటో కూడా చేసింది. ఆ ఫోటోలో కళ్లు పీకేసినట్లుగానీ, చేతులుగానీ ఏ స్పష్టతా లేదు. ఎందుకంటే ఇంత చేస్తే మూడోరోజు హక్కుల సంఘాల వాళ్లు ఆదివాసీ సంఘాల వాళ్లే వెళ్లారు. గ్రామస్తులే ట్రాక్టర్లో తెచ్చారు. చెర్ల మండల కేంద్రం దాకా వాళ్లే తెచ్చారు. అక్కడి నుంచి భద్రాచలం అయినా, భద్రాచలం నుండి విశాఖపట్నం అనకాపల్లి ఆయన తల్లిదండ్రుల దగ్గరికయినా పోలీసులు మూడు రోజులు అడవిలో పడి ఉన్న శవాన్ని ఆ స్థితిలో రొడ్డు వెంబడి తీసుకపోయారే తప్ప ఎక్కడా హెలికాప్టర్‌లు గానీ, గాలింపు చర్యలకు ఉపయోగిస్తున్న సైనిక విమానలుగానీ వాడుకోలేదు. ఆదీ ఆర్‌ఎస్‌ఐ మృతదేహం పట్ట వాళ్లకున్న పట్టంపు, గౌరవం.
అననుకూల వాతావరణంలో నల్లమల అడవుల్లో కూలిన హెలికాప్టర్‌లో మరణించిన ముఖ్యమంత్రి మృతదేహం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయమాలన నడిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాల రాజకీయాలన్ని 2009 ఆగస్ట్ నుంచీ ఆ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ముఖ్యమంత్రి మరణం చుట్టే తిరుగుతున్నది. చికరికీ ఆర్‌ఎస్‌ఐ మృతికి కూడా ఆయన బతికుండగా అనుసరించిన రాజనీతియే సారంశంలో కారణం. గ్రామస్తులు హక్కుల సంఘాల వాళ్లు ఆదివాసీ సంఘాల వాళ్లు చర్లకు తెచ్చిన తర్వాత భద్రాచలం రోడ్డు ద్వారా తెచ్చి భద్రాచలంలో గౌరవ వందనం చేయడాన్ని మించి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఐ మృతదేహం స్వాధీనం చేసుకోడానికి చేసిన ప్రయత్నాలేమిటీ? కృషి ఏమిటీ? ప్రజలకు ప్రజాసామ్య వాదులకు, ఆదివాసులకు బెదిరింపులు తప్ప అబద్దపు ప్రచారాలు తప్ప, వారం రోజులు ఈ ఉదంతం తిరిగిన మలుపులు దగ్గరగా పరిశీలించి విశ్లేషించినపుడు నాక నలభై ఏళ్ల క్రితం సృజనలో డి వెంకటరామయ్యగారు రాసిన ‘ఒక చావు` ఒక మరణం’ కథ గుర్తుకు వస్తే ఆది నా తప్పు కాదు.