అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత ప్రసాద్‌పై హత్యాయత్నం


కత్తితో పొడిచి కాల్పులు జరిపిన దుండగులు
ఇది పోలీసుల పనే : వరవరరావు
నెల్లూరు, జూలై 4 (జనంసాక్షి) :
అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు గంటి ప్రసాద్‌పై పట్ట పగలే హత్యాయత్నం చేశారు. నెల్లూర్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రసాద్‌పై కత్తితో దాడి చేసి గాయపరచడమేకాక కాల్పులు జరిపారు. నెల్లూరులో జరిగిన విరసం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన ిప్రసాద్‌ మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మావోయిస్టు నేత కామేశ్వరమ్మను కమిటీ సభ్యురాలు అంజమ్మతో కలిసి పరామర్శిచేందుకు వచ్చారు. ఈ సమయంలోనే మాటు వేసిన ఉన్న నలుగురు దుండగులు ఒక్కసారిగా దాడికిదిగారు. కత్తితో మూడుసార్లు పోట్లు పొడిచి అతి సమీపం నుంచి గుండె ప్రాంతంలో కాల్పులు జరిపారు. దీంతో నాలుగు రౌండ్ల బుల్లెట్లు లోపలికి చొచ్చుకు పోయాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు చుట్టు పక్కనగల దుఖాణాల యజమానులు, ప్రసాదం వెంటనే ఉన్న అంజమ్మ కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే దుండగులు పరారయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. తేరుకున్న అంజమ్మ, ఇతరులు వెంటనే ప్రసాదంను ఓప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సత్వరమే స్పందించి ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆయన శరీరం నుంచి మూడు బుల్లెట్లను బయటకు తీశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు ప్రసాదం తీవ్రంగానే ప్రయత్నించినట్లు సంఘటనలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పులు ఓచోట, చేతి గడియారం మరోచోట పడిపోయాయి. పూర్తి రక్తపు మడుగుగా తయారైంది. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు రక్తం ఎక్కించారు. మరికొంత రక్తం సిద్ధంగా ఉంచుకున్నారు. తీవ్ర ప్రమాదకరంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విరసం నేతలు, బంధుమిత్రుల కమిటీల నేతలు, పౌరహక్కుల నేతలు స్పందిస్తూ ఇది పోలీసులు కిరాయిగుండాలతో చేయించిన దౌర్భాగ్యపు ఘటనగా అభివర్ణించారు. దీనికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సంఘటన జరిగన గంటన్నర వరకు పోలీసులెవరూ రాకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ఇది ముమ్మాటికీ పోలీసుల పనేనని విరసం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. విరసం సభకు హాజరైన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో ఆసుపత్రి ఆవరణంతా విషాద వదణాలతో నిండిపోయింది. కొద్దిసేపటి క్రితం వరకూ వేదికపై కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన ప్రసాదంపై ఇంత దారుణంగా హత్యాయత్నానికి పాల్పడడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆయనకు శత్రువులంటూ ఎవరూ లేరని, ఆయనను హత్య చేయాల్సినంత దుర్మార్గపు పనులు చేయలేదంటున్నారు. పోలీసులే ప్రైవేట్‌ గుండాలతో కలిసి చేయించారని ఆరోపిస్తున్నారు. కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వార్త క్షణాల్లోనే పట్టణంలో దావానంలా విస్తరించడంతో వేలాదిగా ప్రజలు, మావోయిస్టు సానుభూతిపరులు, పౌరహక్కుల సంఘాల నేతలు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. విరసం నేతలనే కాక మావోయిస్టు సానుబూతి పరులను సైతం కదిలించిందని చెప్పవచ్చు. అమరవీరుల

బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలపై వీరోచితంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. శ్రీకాకుళం నుంచి మొదలుకుని ఆదిలాబాద్‌ వరకు, తిరుపతి నుంచి మొదలుకుని కరీంనగర్‌ వరకు ప్రతి జిల్లాలో సైతం ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. చాలా మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సైతం ప్రసాదం సందర్శించి పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలతో నేరుగా సంబందాలు పెంచుకున్నాడు. తీరా నాలుగున్నర గంటల సమయంలో పట్టణ డిఎస్పీతోపాటు పది మంది ఎస్‌ఐలు, సిఐలు, భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. పౌరహక్కుల నేతల ఆరోపణలపైగాని, సంఘటనపై గాని పోలీసులు నోరు మెదపడం లేదు. ఈ ఘటనకు పాల్పడింది పోలీసులేనని విప్లవ రచయిత వరవరరావు పేర్కొన్నారు.