పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలోమిగల్లే

బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపై నిషేధం పెట్టారని చెప్పారు. ఎక్కడా ఉత్సాహంగా పండుగ జరగకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జేజే నగర్‌లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ నిర్వాకంతో మహిళలంతా నిరుత్సాహపడ్డారన్నారు. పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలో మిగల్లేదని విమర్శించారు.రావలసిన సమయంలో కేసీఆర్ వస్తారని తెలిపారు. వరదల్లో ఒక్క రోజు తిరిగితేనే తట్టుకోలేక నిర్బంధం పెట్టారని వెల్లడించారు. మూసీ , హైడ్రా కూల్చివేతలపై బాధితుల నుంచి వస్తున్న పాటలు ప్రాచుర్యం కాకుండా నిషేధం విధించారన్నారు. నిజాంలను, నియంతలను ఎదురించింది పాటల ద్వారానే ప్రజల గొంతులను పోలీస్ బలంతో ఆపాలని అనుకోవడం మూరకత్వమని చెప్పారు. హామీల అమలుపై ప్రశ్నించకుండా అణచివేయాలనే కుట్ర చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. పండుగ కల తప్పిందని ప్రజలు అనడం రేవంత్ పరిపాలనకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలోమళ్లీ కేసీఆర్ రావాలని అడుగుతున్నారని తెలిపారు. నిషేధాజ్ఞలు ఎన్ని పెట్టినా సంస్కృతి,వారసత్వాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. దాడులు, కేసులు, నిషేదాలతో పాటలను ఆపలేవు రేవంత్ అంటూ హెచ్చరించారు.అట్లతద్దె సంస్కృతి వారితో అంటకాగిన రేవంత్‌కి బతుకమ్మ ప్రాధాన్యం తెలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ ఏర్పాట్లలో విఫలమైనందుకు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ సాంప్రదాయంపై నిర్బంధం పెట్టిన వాళ్లు అంతమైపోయారని చెప్పారు. ఇలానే కొనసాగితే ప్రజల నుంచి అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు.