పారిశ్రామిక రత్నం రతన్‌టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

` అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
` హాజరైన అమిత్‌ షా, సీఎం షిండే
` ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌లు ఘన నివాళి
` వ్యాపార రంగంలో విలువలకు పట్టం కట్టారని వ్యాఖ్య
` రతన్‌ టాటా పార్సీ అయినప్పటికీ.. ఎలక్ట్రిక్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తి
ముంబై(జనంసాక్షి):పారిశ్రామిక దిగ్గజం,టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతకుముందు పలువురు ప్రముఖులు రతన్‌ టాటా పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం అక్కడ నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్టిక్ర్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, సిఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటి సిఎం ఫడ్నవీస్‌, శక్తికాంద్‌ దాస్‌, అంబానీ దంపతులు, ఇతర ప్రముఖులు నివాళి అర్పించారు. హిందూ, ముస్లింల మాదిరి కాకుండా పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్టియ్రన్‌ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశిరచిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ లేదా దఖ్మా అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీనిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలని వీరి ఆశయం. పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ..మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాస్టియ్రన్‌ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు.రతన్‌ టాటా  మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఏ పద్దతిలో జరుపుతారన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. ఆయన పార్దీవ దేహం వద్ద పార్శీ, మస్లిం, క్రిస్టియన్‌ , సిఖ్‌ అలాగే హిందూ మతాలకు చెందిన వారు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.  రతన్‌ టాటాకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, వీఐపీలు ముంబైకి తరలి వచ్చారు రతన్‌ టాటా ఒక్క వ్యాపారవేత్తంగానే కాకుండా సేవతత్పరతో చాలా దేశ ప్రజల మన్ననలు పొందారు. అందుకే  ఆయన లేరనే వార్త తెలిసిన తర్వాత అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రతన్‌ టాటా మరణంపై రేవంత్‌ దిగ్భ్రాంతి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్‌ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్‌  తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన నిష్కమ్రణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్‌ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్‌ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. పద్మవిభూషణ్‌ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్‌ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు. టాటా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రావిూణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్‌ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. టాటా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా రతన్‌ టాటా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రావిూణాభివృద్ధి రంగాల్లో అందించిన  సేవలు చిరస్మరణీయమని అన్నారు రేవంత్‌. రతన్‌ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.
రతన్‌ టాటా మృతికి కెసిఆర్‌ సంతాపం
రతన్‌ టాటా మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధ్యక్షడు , తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అని, సమాజ హితుడుగా.. తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్‌ రతన్‌ టాటా అని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్‌ టాటా అని కేసీఆర్‌ కొనియాడారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అని కేసీఆర్‌ తెలిపారు. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తు కోసం జీవితకాలం తపించిన రతన్‌ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై., నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల రతన్‌ టాటా ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్‌ స్మరించుకున్నారు. మానవతావాది రతన్‌ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్‌ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తి.. పార్సీ అయినప్పటికీ!
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు.అనంతరం గురువారం సాయంత్రం అక్కడ నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
భిన్న సంప్రదాయం..
హిందూ, ముస్లింల మాదిరి కాకుండా పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్‌ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు.అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ (ునీలివతీ నీట ూతిశ్రీవనిఞవ) లేదా దఖ్మా (ఆజీసష్ట్రఎజీ) అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీని గా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలని వీరి ఆశయం.
రాబందులు లేకపోవడమూ..
పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ.. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాస్ట్రియన్‌ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు.
రతన్‌ టాటా మృతి దేశానికి తీరని లోటు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే ఏపీ కేబినెట్‌లో కూడా రతన్‌ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు.దేశ నిర్మాణంలో కీలక భాగస్వామి రతన్‌ టాటాకు గౌరవ సూచకంగా ఏపీ కేబినెట్‌ నివాళులు అర్పించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఉప్పు నుంచి ఉక్కు దాకా ఆయన పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. ఏపీ ప్రజలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉందన్నారు. సామాజిక బాధ్యతగా టాటా సంస్థలు ఏపీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాయన్నారు. రతన్‌ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కేబినెట్‌ను వాయిదా వేశామని మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడిరచారు.  రతన్‌ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ  అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్‌ టాటా అని తెలిపారు. రతన్‌ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్‌ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు. కేవలం మన దేశంలోనే కాకుండా 100కు పైగా దేశాల్లో అనేక పరిశ్రమలు స్థాపించి అనేకమందికి ఉపాధి చూపించారన్నారు. రతన్‌ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రతన్‌ టాటా మృతి పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటన్నారు. ఆయన గురించి తెల్సుకోవాల్సినది చాలా ఉంది. ఈ దేశం గొప్ప మానవతావాదిరని కోల్పోయిందన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్‌ టాటా అని… ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని చెప్పుకొచ్చారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగిగించిన మహోన్నత వ్యక్తి రతన్‌ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా మరణంపై రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రతన్‌ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. విలువలు, విశ్వసనీయత, మానవత్వం కలబోసిన మహానీయుడు రతన్‌ టాటా అని.. ఆదర్శప్రాయుడైన రతన్‌ టాటా జీవితం యువతకు మార్గదర్శకం, అనుసరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని మంత్రి బీసీ జానర్థన్‌ అన్నారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భార్రతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్‌ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం… ప్రజల కోసం… పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్‌ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్‌ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ సంతాపం వ్యక్తం చేశారు. భారత పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించి నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్‌ టాటా అని వెల్లడిరచారు. పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడిరచి పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్‌ టాటా అని కీర్తించారు. దేశమే ముందు అనే సిద్దాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయులు రతన్‌ టాటా అని అన్నారు. దాతృత్వంలో రతన్‌ టాటాకు ఎవరూ సాటిరారని.. కరోనా సంక్షోభ సమయంలో ఆయన వ్యవహరించిన విధానం, అత్యవసరంగా స్పందించిన తీరు, ఖర్చు చేసిన సొమ్ము వెలకట్టలేని దన్నారు. రతన్‌ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటుగా వర్ణించారు. రతన్‌ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్‌ ప్రార్థించారు.