అమరావతి కాకుంటే అరావళి కట్టుకో
– తెలంగాణ సమాజాన్ని కించపరిచితే సహించం
– పొద్దుగాళ్ల లేవడం ఆంధ్రోళ్లు నేర్పిండ్రా?
– హైదారాబాద్ సహజసిద్ధ నగరం
– బాబు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఫైర్
– రవీంద్ర భారతిలో దాశరథి జయంతి ఉత్సవాలు
హైదరాబాద్,జులై22(జనంసాక్షి):అమరావతి కాకుంటే ఆరావళి కట్టుకొండి. నన్ను విమర్శిస్తే సహిస్తా తెలంగాణ సమాజాన్ని కించపరిస్తే ఉరుకునేది లేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తనబతుకేందో తను బతుకుతున్న తెలంగాణపై ఇంకా దాడి కొనసాగుతూనే ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణకు ఓ అస్తిత్వం ఉందని, దానితో అది ముందుకు పోతోందని అన్నారు. అయితే ఇంకా పక్కా రాష్ట్ర సిఎం చంద్రబాబు తన అక్కసును వెళ్ల గక్కుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఎవరికి పొద్దున్నే లేచే అలవాటు లేదని, ఎన్టీఆర్ వచ్చిన తరవాతనే ఇది అలవాటు చేశారని ఎపి సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. రవీంద్ర భారతిలో జరిగిన దాశరథి 91 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, ఇంకా ఇలాంటి దాడిని కొనసాగిస్తే తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ సమాజం, కవి సమాజం, మేధావులు కూడా ఇలాంటి వాటిని దాశరథి స్పూర్తితో దునుమాడాలన్నారు. ఎపి ఓ మంచి రాజధాని అమరావతిని కట్టుకోవడం సంతోషకరమని కెసిఆర్ అన్నారు. ఓకటి కాకుంటే రెండు కట్టుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. అయితే ఇప్పటికీ కొందరు తెలంగాణ విూద అక్కసు వెళ్లగక్కుతున్నారు. హైదరాబాద్ వారికి పొద్దునే నిద్ర లేవడం తెలియదని ఆంధ్ర ముఖ్యమంత్రి అంటున్నారు. ఎన్టీఆర్ వచ్చకే తెల్లారి లేవడం నేర్పాడని చంద్రబాబు అంటున్నారు. తెలంగాణపై వెకిలి మాటలు మాట్లాడితే ఎంతవరకైనా వెళ్తాం. ఎవరు తెలంగాణను కించపరిచినా దాశరథి లాగా సమాధానం చెప్పాలని వేదికపైనుంచి అన్నారు. హైదరాబాద్ హిస్టారికల్ సిటీ అని, . హైదరాబాద్ తెలంగాణ రాజధాని కావడం మన పూర్వజన్మ సుకృతం అన్నారు. ఆంధ్రా రాజధానిపై కొన్ని పత్రికలు ఇవాళ ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసు. ఇక్కడి వారికి ఆ వార్త అవసరమా? అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తాం. తెలంగాణ తన బతుకు తాను బతుకుతుంది. బతకనివ్వండి. రాజధాని కట్టుకోండి.. ఇంకోటి కట్టుకోండి.. హైదరాబాద్ జోలి ఎందుకు అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. దాశరథి కృష్ణమాచార్య గొప్ప కవి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దాశరథి స్పూర్తి తెలంగాణలో నిబిడికృతమై ఉంది. దాశరథి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన మనసు స్వచ్ఛమైనది. ఆయనను ఆంధ్రా ప్రభుత్వం విస్మరించిందన్నారు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని ప్రకటించిన గొప్ప కవి దాశరథి. దాశరథి కవిత్వంలో అగ్నిధారలు కురిసేవి.. రుద్రవీణలు మోగేవి. ఇంకా విూకు తెలియాల్సిన చరిత్రకారులెందరో ఉన్నారు. తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి పురస్కారం అందించడం తన అదృష్టం అన్నారు. సినారె మా ఆరాధ్య కవి. సుకవితా శరథి మా దాశరథి అని సినారె అనడం దాశరథి ఎంతగొప్పవారో ఒకానొక సందర్భంలో చెప్పారని సిఎం అన్నారు. ఆధునిక కవిత్వంలో సినారెతో పోల్చదగిన కవులు ఎక్కడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. అయినా మేము భుజాలు తడుముకోవడం లేదన్నారు. రవీంద్రభారతిలో దాశరథి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి, ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రముఖ రచయిత సినారే, కెవి రమణాచారి, దేశిపతి శ్రీనివాస్, వేణుగోపాలాచారి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దాశరథి పురస్కారన్ని సిఎం కెసిఆర్ చేతుల విూదుగా తిరుమల శ్రీనివాసాచార్యులకు ప్రదానం చేశారు. తిరుమల రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సిఎం కెసిఆర్‌కు అంకితం ఇచ్చారు. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు తెలుగుజాతి ముద్దుబిడ్డ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దాశరథి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలు నేటికీ సజీవమన్నారు. నిజాం దుష్పరిపాలన, రజాకారుల దుర్మార్గాలను దాశరథి తన కవిత్వంలో ఎండగట్టారని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.