అమ్మకానికి సింగరేణి త్వరపడండి..!

నూతన ఆర్థిక సరళీకృత విధానాల మూలంగా సింగరేణి బొగ్గుగనికి కష్టాలు మొరలయ్యాయి. ప్రపంచీకరణ పుణ్యమంటూ మన పాలకులు ఏకంగా అమ్మకానికి పెట్టారు. సింగరేణిని నమ్ముకుని బతుకుతునÊ వేలాది మంది కార్మికుల బతుకులు అతి ఘోరంగా తయారయ్యాయి. జౌట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టీకరణ క్యాజువల్‌తో సింగరేణి సంస్థను ప్రయివేట్‌ దిశలో వేగవంతంగా నడిపిస్తున్నారు. 1995లో సింగరేణిలో 1,35,212 మంది కార్మికులు పని చేస్తే 2012 నాటికి కార్మికుల సంఖ్య 66,332 మందికి కుదించారు. కొత్వ ఉద్యోగాలు అనేవి ఎండమావులుగా మారాయి. బొగ్గు ఉత్పత్తిలో యంత్రీకరణ తీవ్రతరం చేసి ఉనÊ ఉద్యోగాలను ఊడగొడుతున్నారు.య బొగ్గు ఉత్పత్తికి కార్మికుని శ్రమన ఉపయోగించకుండా యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. భూగర్బ గనుల స్దానంలో ఓపెన్‌కాస్ట్‌ గనుల తవ్వకాలను ఎక్కువ చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తుంది. ప్రమాదవ శాత్తు చనిపోయిన కార్మికులను పట్టంచుకున్న దాఖలాలు లేవు. ఇంటి నుంచి పనికి పోయిన కార్మికులు తిరిగి ఇంటి వస్తారనేది నమ్మకం సన్నగిల్లుతుంది. 1889 నుంచి నేటి వరకు కార్మికులు ప్రమాదవశాత్తు సుమారు 380 మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన ప్రతి కార్మికునికి 5లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మృతుని భార్యకు పెన్షన్‌ నెలనెల అందజేయాలి ఇవన్నీ ఏమి అమలు చేయకుండానే యాజమాన్యం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతుంది. కార్మికుల జీవణ స్థితిగతులు దిగజార్చారు. కార్మికులను ఏదో ఒక రకంగా బయటకు సాగనంపాలని సింగరేణి యాజమాన్యం కంకణం కట్టుకుంది. 2009 నుంచి గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్‌ పేరుతో 30 వేల మంది కార్మికులకు విఆర్‌ఎస్‌ ద్వార ఇంటికి సాగనంపింది. గైర్హాజరు కార్మికులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అన్యాయంగా సుమారు పదకొండు వేల మంది కాఇర్మకులను ఎలాంటి నోటీసులు లేకుండా చెప్పచేయకుండా అన్యాయంగా తొలగించింది. ఒక సంవత్సరంలో కనీసం వంద పని దినాల కంటే తక్కువగా ఉనÊ కార్మికులను ఉద్యోగాల నుంచి ఊడబీకింది. అవకాశం దొరినప్పుడల్లా కార్మికులను కుదిస్తున్నారు. బొగ్గు గనుల చట్టప్రకారం బొగ్గు బావిలో ఉత్పత్తి చేసే పని స్థలానికి ప్రతి నిమిషానికి ఆరు క్యూబిక్‌మీటర్ల ద్వారా సరఫరా చేయాలి. ఒక మనిషికి 2.6  క్యూబిక్‌ మీటర్ల గాలిని అందించాలి. 620 మీటర్ల లోతులో కార్మికులు బతుకుపోరు చేయాల్సివస్తుంది. టన్నుల కొద్ది బొగ్గును దేవ విదేశాలకు సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమట ద్వారాపోసి ఉత్పత్తి చేస్తున్నాడు. కార్మికులకు భద్రత చర్యలు తీసుకోకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. చ2012ఆగస్టు 9న జరిగిన గని ప్రమాదంలో 17మంది కారిమకుల జలసమాధయినారు.యాజమాన్యం స్పందన అంతంత మాత్రమే బొగ్గు బావుల్లో గాలి వెలుతురు లేకపోవడంతో సుమారు 12 వేల మంది కార్మికులు అనారోగ్యానికి గురైయ్యారు. దీనిని సాకుగా చూపుతూ అనేక మంది కార్మికులను అర్థంతరంగా తోలగించింది. హైపవర్‌ కమిటి వేలాది మంది కార్మికులకు వ్యతిరేకంగా నివేదికను ప్రభుత్వానికి అందించింది. రెండు సంవత్సరాలలో 190/240పని దినయులు చేసి ఉండాలని కమిటి సూచించింది. 150/200 పని దినాల్లో విధులు నిర్వహించిన వారు ఉద్యోగం పొందడానికి అర్హులుగా నివేదించారు. అర్థంతరంగా విదుల నుంచి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటు కార్మికులు ఆందోళనలకు దిగుతున్నారు. కార్మికులను విధుల్లో నుంచి తొటగించి సింగరేణి యాజమాన్యం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది. బొగ్గు గనుల వేణి మా సింగరేణి 1887లో ఖమ్మం, వరంగల్‌, కరంనగర్‌, ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలకు విస్తరించింది. బ్రిటిష్‌ పాలకులు బొగ్గుందని కనుగొన్నారు. సింగరేణి 122 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కార్మికోద్యమాలు బలంగా ఊపందుకున్నాయి. కార్మిక సంఘం నాయకులు 1948లో దవురి శేషగిరిరావును బ్రిటిష్‌ పోలీసులు వేటాడి కాల్చిచంపారు. మగ్దుం, మెయినోద్దీన్‌ వంటి నేతలు కార్మికుల కోసం రక్తన్ని దారపోశారు. 30 వేల మంది కార్మికుల పర్మినెంట్‌ను యాజమాన్యం మెడలు వంచి చేశారు. ఇవాళ 68 వేల మంది కార్మికులు మూడు పూటలు అన్నం తింటున్నారంటే వీరి త్యాగ పోరాట ఫలితమే పర్మినెంట్‌ కార్మికులనుకురిస్తుంది. కాంట్రాక్ట్‌ జౌట్‌ సోర్సింగ్‌ క్యాజువల్‌గా 15 వేల ంది కార్మికులను నియమించింది. వీరికిచ్చే వేతనాలు అతి తక్కువ కనీస వేతనాలు అమలు చేయకుండా యాజమాన్యం శ్రమ దోపిడికి గురి చేస్తుంది. పర్మినెంట్‌ కార్మికులకు నెలసరి వేతనాలు 30 వేలు చెల్లిస్తుంది. జీతాలు పెంపుకై కార్మికులు సింగరేణిలో మెరుపు సమ్మెలు ఆందోళనలు ధర్నాలు చేసినా యాజమాన్యం అణచివేస్తుంది. పాత గనులు మూసివేసింది. రామకృష్ణాపూర్‌ మందమర్రి శ్రావణ్‌పల్లి, వెంకటాపురం, నసీపూర్‌, భూపాలపల్లి తదితర గ్రామలలో ఓపెన్‌ కాస్ట్‌లకు వ్యతిరేకంగా ప్రజలు అడ్డుకుంటున్నారు. ఓపెన్‌కాస్ట్‌ మూలంగా పర్యావరణం దెబ్బతింటుంది. ముంపు బాధిత రైతు కుటుంబాలకు ఏలాంటి నష్ట పరిహారం పునరావాసం కల్పించకుండానే గెంటేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం రైతుల ఆందోళనలకు ప్రజా సంఘాల మద్దతు పెరుగుతొంది. ప్రభుత్వం రైతుల భవిష్యత్తును ఆలోచించకుండా ఏదో ఒక విధంగా తరిమివేయాలని ప్రయత్నించడం ముర్ఖత్వచర్య సింగరేణి కార్మికులు కష్టపడి నెలంతా పనిచేసి సంపాదించిన పైసలన ఫైనాన్స్‌లకు కుదవబెట్టేది ప్రయివేట్‌ ఫైనాన్స్‌లు కార్మికుల రక్తాన్ని జలగల్లా త్రాగుతున్నారు. గోదావరిఖని మంచిర్యాల పట్టణాలను ఎంచుకుని కార్మికుల జీవణాన్ని ఆసర చేసుకుని పెద్ద మొత్తంలో కుచ్చుటోపి పెడుతున్నారు. నిరక్షరాసులైన కార్మికులు అర్థికంగా, మహిళా కార్మికులు, బోగస్‌ ఫైనాన్స్‌ ల నుంచి మోసపోయారు. కార్మికులు ఆర్ధికంగా చితికలపడిపోయారు. కొందరు కార్మికుల పెండ్లిలు ఆగిపోయినవి మరికొన్ని వివాహాలు వాయిదాపడినవి. 1998నుంచి బినామి పేర్ల మీద సింగరేణిలో ఫైనాన్స్‌లు ప్రారంభించారు. ఫైనాన్స్‌ నూటికి 5 నుంచి 7నూపాయల వడ్డికి అప్పులిస్తారు. సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పులిస్తారు. సింగరేణి కార్మికుల బతుకులు అప్పు ఊబిలోకి కురుకుపోయారు. సింగరేణి సంస్థను కారు చౌకగా ప్రయివేట్‌ వ్యక్తులకు నష్టాలు చూపి కట్ట బెట్టాలని ప్రయత్నిస్తుంది. అందుకే సింగరేణి నుంచి మ్రక్రమంగా ఉద్యోగాల సంఖ్యను కుదిస్తుంది. కార్మకుల సంక్షేమం నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. 68వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను కాపాడు కోడానికై కార్మిక వర్గమంతా చైతన్యమై ప్రయివేటీకరణను అడ్డుకోవాలి సింగరేణి ప్రజల ఆస్థిగా భావించాలి. కార్మిక వ్యతిరేఖ విధానాలను కార్మికోద్యమాల ద్వారా త్రిప్పికోట్టాల్సిన సమయం ఇదే.
(దామరపల్లి నర్సింహారెడ్డి)