అయ్యప్ప స్వామీ భక్తుల కాలినడక ప్రయాణం. మొక్కులు తీర్చుకున్న భక్తులు.

 

భైంసా రూరల్ డిసెంబర్ 21 జనం సాక్షి

నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండల0, లోని కుబీర్ గ్రామం నుండి బై0సా మండలం లోని మహాగా0 గ్రామం లోని పలువురు అయ్యప్ప స్వామి భక్తులు మరియు మాత స్వాములు కాలినడకన ప్రయాణం చేసి బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ అన్నపూర్ణ క్షేత్రంలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రతి బుధవారం తాలూకా లోని ఎదో ఒక గ్రామం నుంచి భక్తులు అధిక సంఖ్యలో కాలినడకన ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటారు.అధిక సంఖ్యలో హాజరై భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. కోరిన కోరికలను తీర్చే అయ్యప్పస్వామి శరణు కోరిన వారిని సైతం రక్షించు వాడని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య షష్టి పూజా కార్యక్రమానికి సైతం భక్తుల అధిక సంఖ్యలో హాజరవుతారు. సాక్షాత్తు కేరళ రాష్ట్రం శబరిమలై అయ్యప్పస్వామి వలె ఇక్కడిభక్తులు పూజిస్తారు.