అరబిందోకు కేటాయించిన కెఓసి-3టెండర్ను రద్దు చేయాలి

ఐ ఎఫ్ టి యు
* జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ప్రసాద్, షేక్ యాకూబ్

టేకులపల్లి, జూలై 8( జనం సాక్షి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసి-3 టెండర్ను అరబిందోకు కేటాయించినందున రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి ప్రసాద్ షేక్ యాకూబ్ షావలి డిమాండ్ చేశారు. భారతకా ర్మిక సంఘాలసమైక్య ఐఎఫ్టియు జిల్లాకమిటీస మావేశం జిల్లాఅధ్యక్షులు డి ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని దేశంలోనేగుర్తింపు పొందిన సింగరేణి సంస్థని నామరూపాలు లేకుండా ప్రైవేటుపరంచేస్తన్నా రన్నారు.
సింగరేణిలో నాలుగు ఓపెన్ కాస్ట్లు యాలం పాటపెట్టి అమ్ముకున్నారని కోయగూడెంఓసి పిట్- 3ని అరబిందో ఫార్మా కంపెనీకి టెండర్ కేటాయించడంసిగ్గుచే టుఅన్నారు.
వెంటనే టెండర్నురద్దు చేసి సింగరేణికి కేటా యించాలని డిమాండ్ చేశారు. మోడీ దేశభక్తి  పేరుతోటి దేశంలోఉన్న ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ టోకునఅమ్ము కుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వనికి వ్యతిరేకంగాప నిచేస్తున్నట్టు ప్రజలను మోసంచేస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ప్రజలకు ఇచ్చినహామీల ప్రకారం కాంట్రాక్టుకార్మికులను పర్మినెంట్ చేస్తానని, ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏఒక్క కార్మికునిపర్మినెంట్ చేయలే దన్నారు. ఇచ్చిన హామీలు డబల్ బెడ్ రూమ్లు, మూడుఎకరాల భూమి, కేజీటు పీజీ ఉచిత విద్యహామీలకే పరిమితమయ్యాయన్నారు.
నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యని వారు తీవ్రంగా విమర్శించారు.
కార్మికుల జీతాలు మాత్రంపెంచకుండా కార్మి కులను తీవ్రఆర్థికఇబ్బందులకు గురిచేస్తున్నార ని అన్నారు.
11వ పిఆర్సి సింగరేణిలో కాంట్రాక్టుకార్మికు లకుఅమలుచేయకుండా సింగరేణిలో కాంట్రా క్టు కార్మికులతోఎట్టి చాకిరీచేయిస్తున్నారన్నారు.
సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టుకార్మిక సం ఘాల జేఏసీ సెంట్రల్ లేబర్అధికారులతో జీతాలు పెంచుతానని మూడునెలలగడువు కావాలని కోరి సమ్మె చేయవద్దని ఒప్పందం చేస్తానని హామీఇచ్చి ఇప్పుడు జీతాలుపెంచ కుండాకాంట్రాక్టుకార్మికు లను మోసంచేయటం
సిగ్గుచేటుఅన్నారు. కాంట్రాక్టు కార్మికుల తక్కువ వేతనాలవల్లనే ఈరోజులాభాలు వస్తు న్నాయని ఆలాభాలకు కారకులైన ఈకార్మికుల రక్తమాoసాలను పీల్చు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి, కోశాధికారి గోనెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ ,పాయం వెంకన్న, బి మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.