అరబ్‌తో భారత్ బంధం బలమైనది
– అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ
– షేక్ జాయెద్ మస్‌జిద్‌ను సందర్శించిన ప్రధాని
హైదరాబాద్ ఆగష్టు 16 (జనంసాక్షి):
రెండు రోజుల యూఏఈ పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ అబుదాబి చేరుకున్నారు. అబుదాబిలో షేక్ జాయేద్ ప్రార్థనా మందిరాన్ని మోదీ సందర్శించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రార్థనా మందిరం షేక్ జాయేద్ విశేషాలను రాజకుటుంబీకులు మోదీకి వివరించారు.ప్రపంచంలో ఐదు అతిపెద్ద ప్రార్ధనా మందిరాలలో షేక్ జాయద్ మస్జీద్ ఒకటి. నలబై వేల మంది ఒక్క సారిగా ప్రార్ధనలు చేసుకునే అవకాశం వుంది. ఈ అద్భుత కట్టడాన్ని చూసి మోది పులకించారు. ఇస్లామిక్ వాస్తును రాజకుటింబీకులను అడిగి తెలుసు కున్నారు. అంతకు ముందు మోది ప్రవాస భారతీయులతో సమావేశమై వారి యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. అరబ్ దేశాలు తనకు మినీ ఇండియా అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, అరబ్ దేశాలు ఎప్పటికీ ముఖ్యమైనవేనని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం మోదీకి ఘనస్వాగతం పలికింది. అనంతరం మోదీ, అరబ్ రాజుతో భేటీ అయ్యారు. దీనికి ముందు విూడియాతో మాట్లాడిన ప్రధాని, గల్ఫ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇక్కడ దాదాపు 26 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారని, గల్ఫ్ దేశాలు తనకు మినీ ఇండియాలా అనిపిస్తాయని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి అబుదాబి చేరుకున్నారు. నేడు యూఏఈ రాజు షేక్ మహ్మద్‌బిన్ జయీద్‌తో దైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. యూఏఈతో పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. వాణిజ్యం, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రదాని మోదీ పర్యటన కొనసాగనుంది.