అర్టీసీ బస్సు ఢీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మృతి
గోదావరిఖని : కోత్తకూరగాయల మార్కెట్ సమీపంలో అర్టీసీ బస్సు డీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మాదనబోయిన కిష్టయ్య (70) అక్కడికక్కడే మృతి చెందాడు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లున్న అమన ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించుకోబోయి అర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చారు. డ్రైవర్ బ్రేకు వేసినా బస్సు పైనుంచి వెళ్లడంతో అయన మృతి చెందాడు. పోలిసులు కేసు నమోదు చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.