అర్హతలు కలిగివున్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా గుర్తించాలి
తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి
ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని తెరాస పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లి మండల కేంద్రం చేయాలని మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, సర్పంచ్ జోగుల రవి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష గురువారంతో ఏడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, పుటాన్ దొడ్డి సర్పంచ్, ఉప సర్పంచ్ నారాయణ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో దీక్షను కొనసాగించారు. దీక్షకు మద్దతుగా తెరాస నాయకుడు శ్రీధర్ రెడ్డి, సరస్వతి స్కూల్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి లు దీక్షకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో అనేక మండలాలను విభజన చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఎర్రవల్లి కూడా మండల కేంద్రంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కలిగి ఉన్నందు వలన పార్టీలకు అతీతంగా దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, వెంకట రాముడు, కె. మద్దిలేటి, వీరన్న, కర్ర బీచుపల్లి, అయ్యప్ప రెడ్డి, బీసన్న, బల్గరి ఉపేంద్ర బాబు, నరసింహులు, బొజ్జన్న, చాకలి నరసింహులు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.