అర్హత ఉండి ఓట్టు హక్కులేనివారందరిని ఓటర్‌ లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవాలి….

సిరిసిల్ల ఆర్‌డివో పాండురంగా….
ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండివ వారందరికి ఈ పంచాయితి ఎన్నికల్లో ఓటు హక్కను కల్పించే బాధ్యత, పోలింగ్‌ భూతులు అధికారులదేనని అందుకే వెంటనే గ్రామాల్లో ఇల్లు ఇల్లు తిరిగి వారి పేర్లను నమోదు చేయించాలని సిరిసిల్ల ఆర్‌డివో పాండురంగ అన్నారు. శనివారం మండల తహశీల్దార్‌ కార్యాలయంలో గ్రామాల పోలింగ్‌ భూతు అధికారులు, అంగన్‌వాడి కార్యకర్తలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్‌డివో పాండురంగ మాట్లాడుతూ….. జూలైలో జరిగే పంచాయితి ఎన్నికలలో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారందరు ఓటు వేశేలా అధికారులు, ప్రజాప్రతినిధులు  కృషి చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు అలాగే ఏ  ఏ విధంగానైన అయిన  ఓటర్‌ లిస్ట్‌లో పేరు లేని వారందరిని వెంటనే నమోదు చేయించాలన్నారు. నిస్పక్షపాలుగా ఓటర్‌ ఫామ్‌లను వారి ఇంటి వద్దనే నింపిచి మండల కార్యాలయంలో  ఆన్‌లైన్‌ ద్వారా వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎ ఒక్కరు నమోదు లేదని అనకుండా గ్రామాల్లో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఇంచార్జీ తహశీల్దార్‌ పి మధుసుధన్‌రెడ్డి, అధికారులు, అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.