అర్హులందరికీ ఆసరా అందిస్తాం

జుక్కల్, ఆగస్టు29,జనంసాక్షి ,
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని తహాసీల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త లబ్ధిదారులకు ఆసరాగుర్తింపుకార్డు లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పెద్ద కొడపగల్ మండలానికి 682 ఆసరా పింఛన్లు మంజూరు అయినాయని తెలిపారు.160మంది వితంతువులకు,36మంది వికలాంగులకు,4గురు ఒంటరి మహిళలకు,8మంది ఇతరులకు ,474 మంది వృద్దులకు ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.ఇందులో పింఛన్లురానివారు నిరాశచెందరాదని ఎమ్మెల్యే తెలిపారు. ఇక నుండి పింఛన్ల మంజూరి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.ఆసరా పించనులకు అర్హత కలిగిన వారు దరకాస్తు చేసుకోవాలని తెలిపారు. గత మూడేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత పింఛన్లు అందిస్తున్నారని ఇప్పుడు మంజూరి కానివారికి మరెప్పుడో అని నిరాశ చెంద వద్దని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికలు, కరోనాలాంటి కారణాలతో అప్పుడు కొత్త పింఛన్ల మంజూరి ప్రక్రియ నిలిచి పోయిందని ఎమ్మెల్యే తెలిపారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.ఈ విదంగాఆసరా దేశంలో ఎక్కడా అందిస్థ లేరని ఎమ్మెల్యే తెలిపారు.ముఖ్య మంత్రి కేసీర్ పుణ్యాన తెలంగాణాలో వృద్ధులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతుకుతున్నారని అన్నారు. తెలంగాణా రాష్టంలో రైతులకు రైతుబందు, రైతుభీమా,వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్తి స్థాయి మరమ్మత్తులు,కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, సకాలంలో ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు లాంటి పథకాలతో రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణా వస్తే ఏమస్తది అన్నవారికి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి,జడ్పిటిసి చంద్రబాగా, మండలకోఆప్షన్ మెంబర్ జాఫర్, స్థానిక సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి,ఎండిఓ రాణి,ఎంపిఓ సూర్యకాంత్,
అధికారులు పాల్గొన్నారు.