అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం

 నాంపల్లి ఆగస్టు 11 (జనం సాక్షి )నాంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా తదనంతరం నాంపల్లి తహసిల్దార్ లాల్ బహదూర్ శాస్త్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో గత ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ఇంటి స్థలాలను ఇప్పటివరకు కేటాయించక పోగా ఆక్రమించుకోవడం దురదృష్టం అని, తక్షణమే ప్రభుత్వం వాళ్లపై చర్య తీసుకుని ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని, స్థానిక మండలంలో ఉన్న బీసీ కాలనీ సమస్యని తక్షణమే పరిష్కరించి 82 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అర్హులైన నిరుపేద వాళ్లకి ఇండ్లు లేని వాళ్లకు ఇంటి స్థలాలు ఐచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం గృహ నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పారు. తక్షణమే వారు ప్రకటించిన విధంగా అమలు చేయాలని అరులైన వాళ్లకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క తెల్ల రేషన్ కార్డు లేకపోవడం చాలా బాధాకరమని 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వార్షిపాక ముత్తి లింగం కామిశెట్టి శ్రీకాంత్, కే.యాదయ్య, గాదెపాక మరియమ్మ, ఏదుళ్ళ పార్వతమ్మ, లక్ష్మమ్మ, ఈరమ్మ, భిక్షమయ్య,లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.