అల్లా దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: సీఎం

C

హైదరాబాద్‌ గంగా జమున తహజీబ్‌

ప్రపంచంలోకెల్లా గొప్ప సంస్కృతి

1లక్ష 96 వేల మంది పేద ముస్లింలకు బట్టల పంపిణీ

నాకు మీ ఆశిస్సులు కావాలి:సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ 12 జూలై (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్రం కావాలని అందరం  కోరుకున్నామని అల్లా దయవల్ల తెలం గాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.  తెలం గాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పోరాడామని  ఆయన  అన్నారు. ఇవాళ నిజాం కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇస్తోన్న విందు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. ముస్లింలం దరికి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  రంజాన్‌ పండుగ సంద ర్భంగా లక్షా 96 వేల మంది పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్ట లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.ఇప్పటికి చేసింది చాలా తక్కువని ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. ‘నాకు విూ ఆశీస్సులు కావాలి’ అని కోరారు. హైదరాబాద్‌ నగరం గంగా, జమునా తహజీబ్‌ సం స్కృతిని కలిగి ఉందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి మళ్లీ అదే సంస్కృతిని నగరంలో నెలకొల్పుదామని కోరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మం డలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, మంత్రులు నా యిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపీ కే కేశవరావు, ఇతర టీఆర్‌ఎస్‌ నేత లు, అధికారులు, పలువురు ముస్లిం సోదరులు హాజరయ్యారు. కాగా జిల్లాల్ల  నల్లగొండలో మదీనా మసీదులో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, నర్సింహరెడ్డి స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరు లు హాజరై విందు స్వీకరించారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో జరిగిన ఇఫ్తార్‌ విందులో మంత్రి హరీష్‌ రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, స్థానికి నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వరంగల్‌ జిల్లా భూపాల్‌ పల్లిలోని సింగరేణి కమ్యూనిటీ హాలులో జరిగిన ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌ మధు సూధనాచారి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ప్రించ్‌ గార్డెన్స్‌లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్ర మంలో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఖమ్మంలో టీఎన్జీవో హాల్‌లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర్‌రావు, జెడ్పీ ఛైర్మన్‌ కవిత, జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్‌, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు హాజరై విందు ఆరగించారు.