తల్లిదండ్రులను సాదకపోతే జీతం కట్‌

త్వరలోనే దీనిపై చట్టం తీసుకొస్తాం
ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదంద్రులకు అందజేస్తాం
గ్రూప్‌`2 అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌
తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు ఇవి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్‌(జనంసాక్షి):నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని గ్రూప్‌`2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత.. విూరందరూ అందుకు అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే .. విూ జీతంలో 10 నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానని అన్నారు. ఒకటో తేదీ విూ జీతం ఎలా వస్తుందో.. అలాగే విూ తల్లిదండ్రుల అకౌంట్‌లో ఒకటో తేదీన పడుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం అని సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్‌`2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌.. చేతుల విూదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్టాన్న్రి సాధించారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగింది. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదు. రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారు. ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. అలాంటి ప్రయోగం రైతులకు చెబితే రైతులంతా బాగుపడేవారు కాదా అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదవిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే విూ ఆశీర్వాదాలే కారణం. రూ.3కోట్లు తీసుకుని గ్రూప్‌`1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు. రాజకీయ చౌకబారు విమర్శలు విమర్శలు ఎదుర్కొన్నప్పడు చాలా ఆవేదన కలిగింది. గతంలో ఎన్నడూ జరగని కులగణన.. కాంగ్రెస్‌ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే విూకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప, గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ పక్రియ పూర్తి చేశాం. గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నామని సీఎం రేవంత్‌ అన్నారు. మిమ్మల్ని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. విూరు.. మేము వేరు కాదు. విూరే మేము.. మేమే విూరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్‌ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్‌ విూడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే విూరు.. ఆ వ్యవస్థలో విూరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు విూరు సామాన్యులు.. ఈ రోజు నుంచి విూరు ఆఫీసర్స్‌. విూ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్‌ తెలంగాణ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్‌ లో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌ తో మళ్లీ అధికారంలోకి రావాలను కుంటున్నారు. అలాంటి వారి పట్ల విూరు జాగ్రత్తగ ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్‌ పాయిజన్‌ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి సిఎం ప్రసంగించారు.
తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు ఇవి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
అయితే బడికి వెళ్లాలి లేదంటే ఉద్యోగం చేయాలి రాష్ట్రంలో ఏ ఒక్కరు ఖాళీగా ఉండొద్దని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం శిల్పకళా వేదికలో గ్రూప్‌ 2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి రావాలి వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లీష్‌ మీడియం లో చదువుకోవాలి నైపుణ్యాలు పొందాలి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్‌ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ తో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీ పనులు శర వేగంగా జరుగుతున్నాయి, రాష్ట్రంలోని ఐటిఐ లను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్‌ 2 నియామక పత్రాలు అందించడం చరిత్రలో సువర్ణాక్షలతో లిఖించదగిన రోజు ఇది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన తన రాజకీయ అనుభవంలో ఏనాడు ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనమే సాధించవచ్చు అన్న ఆశతో దశాబ్ద కాలం పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశాం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన అమరుల ఆశయాలు నెరవేరుతాయి అని కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్లపాటు చూసి చూసిన తల్లిదండ్రుల ఆశలు నెరవేరలేదు అన్నారు. కూలి చేసి రూపాయి రూపాయి పోగేసి తమ బిడ్డలను హైదరాబాదులోని కోచింగ్‌ సెంటర్లకు పంపారు ఆ నిరుద్యోగ బిడ్డలు నోటిఫికేషన్ల కోసం చూసి చూసి అలసిపోయారు, గత పది ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు రాలేదు ఒకటి, అర వచ్చిన అవి సక్రమంగా జరగలేదు అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి సీఎల్పీ నేతగా తాను తల్లిదండ్రులు పడిన ఆవేదనను ప్రత్యక్షంగా చూసామని తెలిపారు. తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలన్న ఆశతో శ్రీమతి సోనియా గాంధీ కేంద్రంలో బలం లేకపోయినా ఇతర పార్టీలతో మాట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. దురదృష్టం గత సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు వారి కుటుంబం మాత్రం బాగుపడితే చాలు అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని ఆ విషయాలను రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాం రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని వివరించారు. యువత ఆశలు నెరవేర్చాలి వారి కోరికలు తీర్చాలి అనే ఏకైక సంకల్పంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ను ప్రక్షాళన చేసాం, గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టు నియామకాలు చేపడితే వారి కాలంలో జరగని పనులు మా ప్రభుత్వంలో ఎట్లా జరుగుతాయని కోర్టు కేసులతో అనేక ఇబ్బందులు సృష్టించారని అయినా వాటన్నిటిని ఎదుర్కొని, కోర్టుల్లో వాదించి గెలిచి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత సంకల్పం అన్నారు. లక్షల మంది తల్లులు మా బిడ్డలు చదువుకొని ఎదగాలి కుటుంబం బాగుపడాలని హైదరాబాద్‌ కు పంపారు, ఈ నియామక ఉత్తర్వులు తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అన్నారు. బాధ్యతతో సమాజ సేవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశం కల్పించింది అని వివరించారు. ఆర్డర్‌ పొందిన నాటి నుంచి రిటైర్మెంట్‌ వరకు సంకల్పంతో రాష్ట్రానికి సేవలు అందించాలి అన్నారు. 2047 వరకు తెలంగాణ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా వృద్ధి చెందాలని ప్రపంచంతో పోటీ పడాలని రూపాయి రూపాయి పోగేసి రైజింగ్‌ తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. నియామక పత్రాలు పొందిన అధికారుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.