అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలు ప్రమబద్దీకరిస్తాం : కేసీఅర్
హిమాయత్‌నగర్ : తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేజీ హెచ్ ఎంసీలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తామని తెరాస అధినేత కేసీఅర్ ప్రకటించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీలోని గుర్తింపు కార్మిక సంఘం కార్యాలయాన్ని ప్రారంబించిన అనంతరం అయన మాట్లాడారు. నగరాన్ని పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అస్పత్రి నిర్మించాలన్న అలోచన ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో తమ పార్టీ ప్రతినిదుల ద్వారా ప్రస్తావిస్తామని చెప్పారు. అస్పత్రి నిర్మించలేని పక్షంలో మంత్రుల ఇళ్ల వద్ద పారిశుద్ధ్య పనులను స్తంబింపజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.