అశ్వాపురం మండలంలో పర్యటించిన గవర్నర్ తమిళసై

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి):

రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ మణుగూరు మండలం రైల్వే స్టేషన్ లో దిగారు. స్థానిక అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి అశ్వాపురం మండలంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వాసితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ కాంతారావు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాసితులకు నిత్యవసర సరుకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా సరుకులు భోజనాలు మందులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడలేదని ధర్నా: అశ్వాపురం మండలంలో రహదారి పై నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలో ముంపుకు గురైన ఐదు మండలాల నిర్వసితులను పరామర్శించకుండా వెళ్లారని రహదారిపై ధర్నాకు దిగారు. మా గోడును వారికి చెబుతామనుకుంటే వారికి మొండి చేయి ఎదురైంది.. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలలో 15 వేల మందికి పైగా జీవిస్తున్నారు. వారికి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎక్కడ వస్తువులను అక్కడే వదిలి కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలించారు. అప్పటినుంచి అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన బట్టలతో మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు అధికారులు గానీ ప్రజాప్రతినిదులు కానీ రాలేదు.మాకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నాం. చిన్నపిల్లలు దగ్గు జ్వరం వచ్చి అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మందులు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం మా గోడును ముఖ్యమంత్రితో చెప్పుకుందామనుకుంటే ఆగకుండా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే మాకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లని నష్టపోయిన పంట పొలాలకు పాడైపోయిన ఇండ్లకు వస్తువులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు