అశ్వాపురం మండల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

పినపాక నియోజకవర్గం జులై 11 (జనం సాక్షి): అశ్వాపురం మండలంలో మూడు  రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  లోతట్టు ప్రాంతాల్లో జలమై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజా ప్రతినిధులు అధికారులు అందుబాటులో ఉండాలని అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ  ఎంపిటిసి సంఘం అధ్యక్షురాలు కందుల దుర్గాభవాని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వాగులు  వంకలు పొంగిపొర్లుతున్నాయి. యువత సరదా కోసమని నీటిలో  దిగి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. రైతులు   పొలం పనులకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసు కోవాలి పొలం దగ్గర ఉన్న కరెంట్ స్తంభాలను ముట్టుకోకుండా  జాగ్రత్త వహించాలన్నారు.  వరదలు వస్తుండటంతో ప్రజలకు అవగాహన కల్పించటం లో ప్రధానంగా పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తడిసిన కరెంట్ స్థంబాలను విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు, బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో పట్టుకోరాదు చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి.క్వార్టర్ లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను .ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను. వర్షం పడుచున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను,లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్  అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఉన్నారు.