అశ్వాపురం మండల ప్రజలకు విజ్ఞప్తి

తహసిల్దార్ సురేష్ కుమార్
పినపాక నియోజకవర్గం జులై 13( జనం సాక్షి): ఎడతెరపి లేకుండా గత ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వాపురం తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాచలం గోదావరి నీటి మట్టం గంట గంటకు నీటి స్థాయి పెరిగి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు గోదావరి వరద 60 అడుగుల దాటుతోందని, రేపు ఉదయానికి 66 అడుగులు చేరుకుంటోదని అంచనా లోతట్టు ప్రాంతాలైనా అశ్వాపురం మండలం లోని పాములపల్లి, అమ్మ గారి పల్లి, బట్టీలగుంపు రాంనగర్, కుమ్మరిగూడెం, ఆనందపురం, చింత్రియాల, నెల్లిపాక, టేకుల గుట్ట గ్రామాలలోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అశ్వాపురం రెవెన్యూ, పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సబంధిత గ్రామాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి కమిటీలు ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, పశువులను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని సురేష్ కుమార్ తెలిపారు