ఆందోళన వద్దు అండగా ఉంటాను.

మీకు కష్టం రానివ్వకుండా కాపాడుకుంటాం.
– వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి.
– ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నాం.
బూర్గంపహాడ్, జూలై..(జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణం లోని పలు ప్రాంతాలలో గత మూడు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో  లోతట్టు ప్రాంతాలనుు స్థానిక జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలతో ఆందోళన వద్దు. అండగా ఉంటామని వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, మీకు కష్టం రానివ్వకుండా కాపాడుకుంటామని వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటున్నామని ధైర్యం చెప్పారు. వర్షాలతో వాగులు ప్రవహిస్తున్న కారణంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో ఏదైనా ఇబ్బంది కలిగితే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే తక్షణమే సహాయక చర్యలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్. ఎన్ రాజు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, వట్టం రాంబాబు, కొనకంచి శీను, బాలి శ్రీహరి, ఆంజనేయులు, గుల్ మహమ్మద్, తిరుపతి ఏసోబు, అరుణ్ ప్రసాద్, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, కార్యకర్తల అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.