ఆంధ్రా జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చింది
– తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం
– నాలుగేళ్ల పసి తెలంగాణాను అభివృద్ధిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
– నాకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు
– కాంగ్రెస్ నేతలంతా నా అన్నదమ్ములే
– నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తా
– పాతికేళ్ల సుధీర్ఘ యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి
– 2019లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
– మార్చి 14న పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తా
– తెలుగు రాష్టాల్ల్రో బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తా
– కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
కరీంనగర్, జనవరి23(జనంసాక్షి) : ఆంధ్రా నాకు జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చిందని.. తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు ఆంజనేయుడు నన్ను కాపాడారని పవన్ గుర్తుచేశారు. తెలంగాణ నేలతల్లికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని పవన్ అన్నారు. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలంతా నా అన్నదమ్ములేనని అన్నారు. తెలంగాణ నాలుగేళ్ల పసిబిడ్డ అని, . తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణను జాగ్రత్తగా కాపాడాలనే ఆచితూచి మాట్లాడతానన్నాని పవన్ తెలిపారు. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టమన్న పవన్ రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవారిని ప్రేమిస్తానని చెప్పారు. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఉన్నానన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై పోరాటం, పర్యావరణాన్ని పరిక్షించే విధానాన్ని ప్రకటిస్తానన్నారు. మార్చి 14లోపు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. విధానాలనే ప్రశ్నిస్తానని, నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలేదని పవన్ చెప్పారు. ప్రేమ ముందు ద్వేషం చాలా చిన్నదని, నన్ను ద్వేషించేవారిని పట్టించుకోనన్నారు. నాకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. నా సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిచ్చానని గుర్తుచేశారు. భాషను, యాసను గౌరవించే సంప్రదాయం ఉండాలన్నారు. సంస్కృతులను కాపాడే సమాజం కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు. ప్రాంతీయవాదంలో పడి జాతీయవాదాన్ని విస్మరించొద్దన్నారు. దేశ విభజన అనంతరం హిందూరాజ్యంగా ప్రకటించే అవకాశం ఉన్నా.. నాటి నేతలు దూరదృష్టితో లౌకికరాజ్యంగా ప్రకటించారని పవన్ పేర్కొన్నారు. ‘కుల, మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలని, అధికారం కొన్ని కులాలకే పరిమితమైందన్నారు. అన్ని కులాలకు సీట్లివ్వడమే సామాజికన్యాయం కాదని.. అన్ని కులాల వారికి ఆర్థిక భద్రత అవసరం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు. అవినీతిని జనసేన దరిచేరనీయదని పవన్ స్పష్టం చేశారు.
ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా ఆంధ్రవారిని పిలవలేదని బాధ కలిగింది. తెలంగాణ కవులు, కళాకారుల ఉనికిని గట్టిగా చాటాలనే ఆంధ్రా కవులను తెలుగు మహాసభలకు పిలవలేదనుకుంటా అన్నారు. తెలంగాణ, ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తానని తెలిపారు. సమస్యలు-వాటి పరిష్కారాలు ప్రభుత్వాలకు తెలియజేస్తానన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే పోరాడేందుకు సిద్ధమేనని పవన్ వ్యాఖ్యానించారు. నిజమైన అభివృద్ధి, అవినీతి రహిత సమాజం ఒకరోజులో సాధ్యంకాదన్న పవన్ పాతికేళ్ల సుదీర్ఘ యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విూ వెంట నేనున్నా… మాట ఇస్తే వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, తెలంగాణ ఆడబిడ్డల ఆకాంక్షే… జనసేన ఆకాంక్ష అన్నారు. తెలంగాణ యువత నాకు అండగా నిలబడాలని, నాకు డబ్బు అవసరం లేదు. ప్రజా అభిమానాన్ని మించిన సంపద ఏదీ లేదు అని పవన్ కల్యాణ్ వివరించారు.
పవన్ బసచేసిన ¬టల్ వద్ద ఉద్రిక్తత ..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బసచేసిన ¬టల్ వద్దకు మంగళవారం ఉదయం పెద్దసంఖ్యలో
అభిమానులు తరలివచ్చారు. దీంతో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా ¬టల్ అద్దాలు పగిలాయి. సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పవన్‌కు భద్రత కల్పించాల్సిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో అభిమానులను నిలువరించలేకపోయారు.