ఆగని అన్నదాతల ఆత్మహత్యలు,ఆకలి చావులు

ప్రపంచీకరణలో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయడం, వరుస కరువు కాటకాలు నీటి సౌకర్యాలు లేక బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలయి, చేసిన అప్పులు తీర్చలేకదేశ వ్యాప్తంగా 1955 నుంచి 2012 వరకు సుమారు మూడు లక్షల మంది రైతులు ఆకలి చావులు ఆత్మహత్యలకు పాల్పడినారు. మన రాష్ట్రంలో 1995 నుంచి 2012వరకు సుమారు 35,210 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. 2013 గడిచిన మూడు నెలల కాలంలో 125 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. కనీసం ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలను వ్యక్తిగత ఆత్మహత్యలని నింధిస్తుంది 2014 జూన్‌ 1న కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన 421 ఈజిఓ 1998 జూలై 1 తరువాత ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు వర్తిస్తుందని జిఓలో పేర్కొంది. జిఓ ప్రకారం రైతు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏలాంటి ఆర్థిక సహాయా లు అందలేదు. దీంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వం కార్యాల యాలు చూట్టూ తిరుగుతూ నానాఅవస్థలు పడుతున్నారు. అర్థాకలి తో అలమటిస్తున్నారు. విద్యుత్‌ కోతలు సంభవించడంతో చేతికొ చ్చిన పంటలన్ని ఎండిపోతున్నాయి. రైతు గుండే తరుక్కుపోతోంది. విద్యుత్‌ కోతల వల్ల వరి పంటలకు 35000 వేల కోట్ల మేరకు పంటలు 5వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుంది. విద్యుత్‌ కోతలతో వ్యవపాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. వ్యవసాయ రంగానికి ఏడు గంటల విద్యుత్‌ అందిస్తామన్న పాలకులు కనీసం మూడు గంటలు కరెంటును సరఫరా చేయలేపో తున్నారు.దీంతో రైతాంగం గడ్డు పరిస్థితిని అనుభవిస్తుంది.దీనికి తోడు ఇటీవల కాలంలో 7 జిల్లాల్లో కురిసిన వడగళ్లు, అకాల భారీ వర్షాలకు 625 లక్షల ఎకరాల్లో పంట నేల రాలిపోయింది. అన్నపూర్ణగా పేరొందిన మన రాష్ట్రం, ఆత్మహత్యల ప్రదేశ్‌గా తయారియింది. డిస్కంలు 30వేల కోట్ల అప్పులోకి కూరుకపోర ుునాయి. దేశ వ్యాప్తంగా 1.85లక్షల కోట్ల మేరకు డిస్కంలు అప్పుల్లో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఉద్దీపన ప్యాకేజిని కూడా ప్రకటించింది. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జేట్‌ను కల్పిస్తామని ప్రభుత్వం ఆశలు కల్పిస్తుంది. పాలకులు తమ అధికారాన్ని కాపాడుకోడానికి చూపుతున్న ప్రత్యేక శ్రద్ద వ్యవసా యంపై చూపకపోవడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నీటి మట్టాలు తగ్గిపోవడం భూగర్భ జలాలతో సాగు చెద్దామంటే కరెంటు కోతల వల్ల రబీలో వరి సాగు విస్తీర్ణం భారీ స్థాయిలో తగ్గిపోయింది. ధాన్యం దిగుబడి పడిపో నుంది. దీని వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఈయేడాదిలో రబి పంట కోటి ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 89 లక్షల ఎకరాలలో పంట సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. పంట సాగు కాలేదని రైతులు రైతు సంఘాలు కలవరుపడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్లు వ్యవసాయరంగానికి సహాకారం అందిన ట్లుగా దిగుబడులు ఎందుకు తగ్గుతాయి, అన్నదాతలు ఆత్మహ త్యలు ఎందుకు చేసుకుంటున్నారని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వా ను ప్రశ్నిస్తున్నారు. మిల్లర్లు ముందుగానే పరిస్థితిని అంచనావేసి బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. బియ్యం ధరలు మరింత పెరగనున్నాయి. సాధారణ సన్న బియ్యాన్ని కొనలేని పరిస్థితి దాపురించింది. రైతుల అత్మహత్యల నివారణకు ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. కౌలు దారులతో సహా రైతుందరికి బ్యాంకు రుణాలిప్పించాలి మెట్ట భూములు అభివృద్ది దృష్టిని కేంద్రీకరించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహించాలి కమిషన్‌ సిఫార్సు చేసినప్పటికీ వీటిని పూర్తిగా తుంగలో తొక్కింది. ప్రభుత్వాలు మాత్రం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం ఏది చేయలేకపోయింది. ఆర్థిక సంస్కరణల ప్రభావం పడింది. వ్యవసాయాన్ని సరళీకరిం చారు. దిగుమతిని తగ్గించారు. మన దేశంలో నేటికి అత్యధిక జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వ్యవసాయ రంగం కార్పొరేట్‌ వైపు పరుగెత్తడంతో రైతుల పరిస్థితి వలసలుగా మారినవి. మానవ శ్రమకు పని కల్పించకుండా యంత్రాలు వాడడం వల్ల వ్యవసాయ కూలీల పనిదినాలు తగ్గిపో యినాయి. నిరుద్యోగం రాజ్యమేలుతున్నది. పాలకుల వాదనలు మరోల ఉన్నాయి. వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిందని చెబుతు న్నారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు విత్తనాలు ఎరువులు పురుగలు మందులు అన్నికల్లీవే సాగునీటి సమస్యలు, కరెంటు,గిట్టుబాటు ధరలు తదితర సమస్యలతో రైతాంగం కోట్టుమిట్టాడుతుంది. పాలకులు దొపిడీ సామ్రాజ్యవాదానికి దాని ప్రపంచ ఆర్థిక సంస్థలకు వ్యవసాయ రంగాన్ని పణంగా పెట్టడం వల్లే దివాళా తీసిన భారతదేశంలో రైతులు నిరాశతో విప్పటి వరకు కోటి ఇరవైఐదు లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని మానుకు న్నారు. దిన దినంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే అదేమి లేదని పాలకులు కొట్టిపారేయడం కొత్తేమి కాదు. సెజ్‌లు భారీ ప్రాజెక్టులు ఖనిజ సంపదంతా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి దేశ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడు తున్నారు. రైతులను బికారులుగా చేసి వ్యవసాయ కూలీలుగా అడ్డా కూలీలుగా మారుస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు సహాకార వ్యవసాయం పేరిట ఉత్పత్తి పెంచేందుకు చిన్న సన్నకారు క్షేత్రాలను సంఘటితం చేసి కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని దొడ్డి దారిన చాపకింద నీరులా వ్యాప్తింపజేసింది. రైతుల పరిస్థితులు ఎలా మారాయో మనకు కోట్టచ్చినట్లు కనిపిస్తుంది. పాలమూరు, మెదక్‌, వరంగల్‌, గుంటూర్‌, విశాఖపట్నం రైతులు బతుకులు అతి ఘోరంగా తయారైనాయి. ప్రపంచీకరణ విధానాలు రైతుల పాలిట శాపంగా మారినాయి. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొని కార్పొరేట్‌ సంస్థలు శతకోటీశ్వరులకు దారాదత్తం చేస్తున్నారు. భూమిలేని రైతులు అంటే భూ నిర్వాసితులుగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది రైతులు మారారు. జానేడు పోట్టను నింపుకోవడానికై పట్నంలో అడ్డాకూలీగా అవతారమెత్తాడు కనీసం మూడు పూటలు కూడా తిండికి నోచుకోవడం లేదు.
– దామరపల్లి నర్సింహా రెడ్డి