ఆగస్టు 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో

కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజన సేవ
తిరుమల, జూలై 10: శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుబంధ ఆలయాల్లో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనసేవలు ఆగస్టు 2న సుమారు 10వేల ఆలయాల్లో నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో జరిగిన తిరుమంజన సేవ కార్యక్రమం టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి నిత్యం అందించే సేవల్లో, ఇతర కార్యక్రమాల్లో తెలియకుండా జరిగిన తప్పులను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని టిటిడికి చెందిన అన్ని అనుబంధ ఆలయాల్లో సంవత్సరానికి నాలుగు మార్లు తిరుమంజన సేవ నిర్వహిస్తారని సుబ్రహ్మణ్యం తెలిపారు.