ఆగస్టు 26 న జరగనున్న బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ధనుంజయ నాయుడు పిలుపు

గరిడేపల్లి, ఆగస్టు 17 (జనం సాక్షి):ఆగస్టు 26వ తేదీన హైదరాబాద్ ఎల్బీనగర్ లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్ లో జరిగే బీసీ హక్కుల సాధన సమితి మూడవ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.బుధవారం ఆయన గరిడేపల్లి లో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ జనాభాలో సగభాగమైన బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందిన నాడే దేశము అభివృద్ధి చెందినట్లుగా భావించాలని 92 శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు నేటికీ స్వాతంత్ర ఫలాలు అందలేదని త్వరలో చేపట్టనున్న జనగణనలో బీసీ జన గణన చేపట్టి బీసీల జనాభా ఎంతో లెక్క తేల్చాలని జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్లో ఆయా కులాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి  ఆ ఊసే ఎత్తడం లేదని రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 50వేల కోట్లు కేటాయించితేనే   వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ యువతకు రుణాలు ఇస్తామని చెప్పి ఇంటర్వ్యూలు నిర్వహించి  ఐదు లక్షల నాలబై  నాలుగు వేయిలు మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కేవలం పది వేలు మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని బీసీల్లో అధిక జనాభా కలిగిన యాదవులకు ఒక్క విడత మాత్రమే ఉచిత గొర్రెలు పంపిణీ చేసి రెండో విడత చేస్తామని చెప్పి  మాట తప్పారని  బీసీ కులాల వారికి హైదరాబాదులో కుల సంఘాల కార్యాలయాలు నిర్మిస్తామని బూటకపు వాగ్దానం చేశారే తప్ప ఆ వాగ్దానం అమలు చేయలేకపోయారని ఇలా ఎన్నో సమస్యలపై అతలాకుతలం అవుతున్న బీసీ సోదరి సోదరులు 26వ తేదీన జరుగుతున్న బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర మహాసభల్లో పాల్గొని బీసీల సమస్యపై చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు బీసీలు కదలి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆయన వెంట ఏఐవైఎఫ్  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను ఉన్నారు.