ఆజాద్‌పై ఎంపీ పొన్నం ఫైర్
కరీంనగర్: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదన్న ఆజాద్, డిసెంబర్ 2009కి ముందు ఇదే మాటని ఎందుకు చెప్పలేదని పొన్నం ప్రశ్నించారు. ఒకసారి రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన తర్వాత మాట నిలబెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన కేంద్రం దానిని అమలు చేయకపోతే పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించినట్లవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కలిగించేలా త్వరలో తమ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.