ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలి: ఎమ్మెల్యే
జనగామ,డిసెంబర్12(జనంసాక్షి): రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ దశలో రైతులు ఇంకా ఆటోమేటికి/- స్టార్టర్లు ఉపయోగించడం సరికాదన్నారు. తోణం వాటిని తొలగించుకోవాలన్నారు. రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లను వినియోగిస్తుండడంతో విద్యుత్ వృథా అవుతోందన్నారు. 24 గంటలు విద్యుత్ మోటార్లు నడుస్తుండడంతో బావుల్లోని, బోరుబావుల్లోని నీరు వృథాగా పోతోన్నదన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అన్నదాతలు ఆటోమెటిక్ స్టార్టర్లను వాడొద్దని ఎమ్మెల్యే సూచించారు.రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవసం దండగంటూ కరెంటు కష్టాలు తెచ్చిన చంద్రబాబుకు, లోవోల్టేజీ విద్యును అందించి కరెంటు కస్టాలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీలను ప్రజలు కనుమరుగు చేశారన్నారు. నేడు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం మరో కోనసీమగా మారి విపరీతంగా ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు.