ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న నారాయణమ్మ (30), నర్సమ్మ (40), పర్శయ్య(28) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా దామరగిద్ద మండలం బాపన పల్లికి చెందినవారు. గాయపడిన ఆరుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.