ఆత్మయ సమ్మేలన సన్నాహక సమావేశం
రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారి గురువు రఘు కిషోర్ సమక్షంలో కొంత మంది పూర్వ విద్యార్థులు కలసి ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తమ తోటి పూర్వ విద్యార్థులు అతి త్వరలో ఏర్పాటు చేసుకోబోమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తమ క్లాస్మేట్స్ అందరూ హాజరుకావాలని కోరారు.ఈ కార్య క్రమంలో పూర్వ విద్యార్థులు చెలుకల కృష్ణ,దరిపెల్లి
గంగాధర్,వడ్లూరి చంద్రమౌళి, తుమ్మనపల్లి వెంకటేష్,గట్ల ప్రకాష్, దోపతి శ్రీనివాస్, మాడిశెట్టి పూర్ణచందర్, మాడిశెట్టి శివ,నంద్యాడపు లక్ష్మీ నర్సయ్య,దొంతినేని శ్రీధర్ రావు,మంచే గంగాధర్, ఇప్ప మల్లేశం,పరాంకుశం ఆచ్యుత్ తదితరులు పాల్గోన్నారు.