ఆదివాసిబంధు ఇవ్వండి
` దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయండి
` దళితుడు సీఎం కాలేదు ..దరిద్రుడయ్యాడు
` దళిత, గిరిజన హక్కుల కోసం నిరంతరంగా శ్రమిస్తా
` వారికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీనే
` దళిత,గిరిజన దండోరాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్,ఆగస్టు 9(జనంసాక్షి):దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని పీసీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రాష్టాన్రికి దళితుడు ముఖ్యమంత్రి కాలేదని.. కాని కెసిఆర్ పానలతో దరిద్రుడయ్యాడని విమర్శించారు. దళిత సిఎం హావిూని నెరవేర్చని కెసిఆర్ ఇప్పుడు దళితబంధుతో మరోమారు దళితులను మోసం చేసేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్కన్నారు. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టి కేసీఆర్‌ను చర్లపల్లిజైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది ఇంకా 22 నెలలేనన్నారు. స్వేఛ్చ కోసం పోరాడి ప్రాణాలిచ్చిన గడ్డ ఇంద్రవెల్లి అన్నారు. దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా విూరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే… ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు. ఇకపోతే తెలంగాణ ఇచ్చినందున తెలంగాణకు అసలు తల్లి సోనియా గాంధీనే అన్నారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రూ.4లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్టాన్న్రి అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి విూద లక్ష రూపాయల అప్పు చేసి పెట్టారన్నారు. కేసీఆర్ ప్రజలకు ఒక్కరూపాయి ఇవ్వలే కానీ.. బిడ్డనుబిర్లా..అల్లుడిని అంబానీ, కొడుకును టాటాను చేసి..ఫాంహౌస్‌లో మందు తాగి పడుకున్నాడన్నారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్..పంచెకట్టుకుంటున్నాడని దళితుడిని మంత్రిపదవి నుంచి తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదన్నారు. ఇంద్రకరణ్, జోగురామన్న, బాల్క సుమన్ ల బానిసత్వం ఆదిలాబాద్ జిల్లాకి అరిష్టంగా మారిందన్నారు. దళిత నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్దపీఠ వేసిందన్నారు. అడవిలో జంతువుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో ఆదివాసీల బ్రతుకుతున్నారన్నారు. కేసీఆర్ లాంటి బద్మాష్ మాటలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. పేదలకు చిల్లి గవ్వ ఇవ్వకున్నా.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై లక్ష రూపాయల అప్పు భారం మోపారన్నారు. ఆదిలాబాద్ లో 90 గ్రామాలకు ఇప్పటి వరకు రక్షితమంచి నీరు అందడంలేదన్నారు. కొంతమంది పోలీసులు కేసీఆర్‌కి కట్టు బనిసలుగా మారారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు. రాజకీయాల్లో ఇంకా 20ఏళ్ళు ఉంటానని.. చివరి రక్తపు బొట్టు వరకు కార్యకర్త కోసం బ్రతుకుతానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆదివాసీల జీవితాలు చితికి పోయాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇంద్రవేల్లి గడ్డవిూద అడగుపెడితే రక్తం సలసల కాగుతోందని, ఇంద్రవెల్లి ప్రాణాలను త్యాగం చేసిన గడ్డ అని అన్నారు. అదివాసీ హక్కులు, విముక్తి కోసం పోరాడి ప్రాంతమని గుర్తుచేశారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా స్మారక స్తూపం నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. ఒకప్పుడు అదిలాబాద్ అంటే గోదావరి, కడేం గుర్తుకు వచ్చేదని కానీ ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేసే నేతలు గుర్తుకు వస్తున్నారని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ గిరిజన ద్రోహి పార్టీ అని, వారు అమలు చేసేది దళిత బంధు కాదని టీఆర్‌ఎస్ రాబందు అని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అడవి నుంచి గిరిజనులను బయటకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి ఇంద్రవెళ్లిలో దండోరా మోగిస్తున్నామని సీఎల్పీ భట్టి విక్రమార్క తెలిపారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తెచ్చి గిరిజనులకు హక్కులు కల్పించింది కాంగ్రెసేనని చెప్పారు. 119 నియోజకవర్గాల్లోని దళితులందరికి దళితబంధు నిధులివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం గిరిజన బంధు తేవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అంతకుముందు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ అమరవీరుల స్థూపానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సభకు ఏఐసీసీ నేత శ్రీనివాసకృష్ణన్, భట్టి, షబ్బీర్, సీనియర్ నేతలు హాజరైనారు. అయితే ఈ సభకు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ గైర్హాజరైనారు.