ఆదివాసీ మహిళల పై దాడిచేసిన, అధికారులపై కేసునమోదు చెయ్యాలి

ర్గం ప్రేమ్ కుమార్,జిమ్మిడి ప్రకాష్ .
,జులై12(జనంసాక్షి): ఆదివాసీ మహిళల పైన దాడిచేసి,ఇండ్లను ధ్వంసం చేసి తినే అన్నాన్ని బురుదలో పడవేసిన అటవీశాఖ అధికారులపైన మరియు అందుకు సహకరించిన వారిపైన కేసునమోదు చెయ్యాలని  దుర్గం ప్రేమ్ కుమార్,జిమ్మిడి ప్రకాష్ నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ అన్నారు.  అటవీ హక్కుల చట్టం2006ప్రకారం పొడుసాగుదరులందరికి హక్కుపత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలపై ఉంది.2021,నవంబర్ ,డిసెంబర్ నెలలో పొడు సాగుదరులందరికి హక్కు పాత్రలు ఇస్తామని దరఖాస్తులు తీసుకుని ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా వాటి పరిశీలన కరువైంది.హక్కు పత్రాలు వస్తాయని ఆశపడ్డ గిరిజనుల పై ప్రభుత్వం కక్ష్య కట్టి అటవీశాఖ అధికారులను మరియు మరికొందరని ఉసిగొల్పి గిరిజన పొడు రైతుల పైన విచక్షణ రహితంగా గుడిసెలను ధ్వంసం చేసి,బట్టలను బురద లో తొక్కి వండుకున్న అన్నాన్ని నెలపాలు చేశారు.పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వలు పేదల నోటికడి కుడు లకోవడాన్ని నేతకాని హక్కుల పోరాటం సంగం తీవ్రంగా కండిస్తుంది అని అన్నారు.ఇకనైనా ఈ ప్రభుత్వలు బుద్ధి తెచుకొనిపోడు రైతుల పై దాడిచేసిన అటవీశాఖ మరియు  వారికి సహకరించిన వారిపైన sc st అట్రాసిటీ కేసు నమోదు  చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాడి దినేష్, రామటెంకి వంశీ, దుర్గం సురేందర్ పాల్గొన్నారు.