ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య

పెద్దపల్లి,జూన్‌8(జ‌నం సాక్షి): పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న కొప్పుల ఓదేలు (65)ను దుండగులు గొడ్డలితో నరికి చంపేశారు. పోస్టుమార్టం కోసం ఓదేలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారకులు ఎవరన్దని దర్యాప్తు చేస్తున్నారు.