ఆరోగ్య తెలంగాణే లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే హెల్త్ ప్రొఫైల్ ఉద్దేశం…
రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు
సిటీ స్కాన్ 10 పడకల ఐసియు,పిఎస్ఏ ప్లాంట్,పాలి ట్యూబ్ కేర్ ప్రారంభించిన మంత్రులు….
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు….
ములుగు జిల్లా ను సందర్శించిన మంత్రులు…
గట్టమ్మ ను దర్శనం చేసుకున్న మంత్రులు….
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య,ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అధికార యంత్రాంగం మర్యాదపూర్వకంగా మంత్రులకు స్వాగతం పలికారు
యాంగ్ డైనమిక్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లాలో చురుగ్గా పనిచేస్తూ మేడారం జాతర విజయవంతం చేసినందుకు వారిని, వారి టీం ని అభినందించిన మంత్రులు….
ములుగు బ్యూరో,మార్చి05(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన నుండి పుట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ తొలుత ములుగు జిల్లా రాజన్న సిరిసిల్ల లో హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమం ప్రారంభించడం అందరికీ తెలిసిందే.ములుగు జిల్లా శనివారం రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత,ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిసి గట్టమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం మార్కెట్ యార్డులో రేడియాలజీ సెంటర్ చిన్నపిల్లల హాస్పిటల్ భవనానికి సంబంధించి శిలాఫలకం శంకుస్థాపనలు చేశారు.అనంతరం ములుగు ఏరియా హాస్పిటల్ సందర్శించి డయాగ్నస్టిక్స్ సెంటర్ 250 పడకల సామర్ధ్యం కలిగిన ఆసుపత్రి ప్రారంభం దీనికి గాను 41.18 కోట్లతో మంజూరు చేసిన ఆసుపత్రిని ప్రారంబించారు.ఆసుపత్రి తిరుగుతూ రోగులను పలకరిస్తూ పర్యవేక్షించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఈ సందర్భాన్ని ములుగు జిల్లా లో మొట్టమొదటి సారిగా ప్రారంబించి నందుకు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ,ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఇలాంటి కార్యక్రమం అమెరికా యూరప్ లాంటి దేశాలలో జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.ములుగు జిల్లాలో ఇంటింటికి తిరుగుతూ 40 రోజులలో ప్రజల ఆరోగ్య వివరాలు సేకరరించాలని,ప్రతి టీంలో ఇద్దరు ఎఎన్ఎం, ముగ్గురు ఆశ వర్కర్లు,మెడికల్ ఆఫీసర్ వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొంటారని అన్నారు.ఈ కార్యక్రమం విజయవంతానికి 10 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు బీపీ షుగర్ రక్త నమూనాలు స్మార్ట్ఫోన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేస్తారని వారి ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని ఆధార్ కార్డు కొట్టగానే వారి ఆరోగ్య వివరాలు తెలుస్తాయని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యం అందించడానికి అనువుగా ఉంటుందని అన్నారు.ఆరోగ్య వివరాలు సేకరించిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. ములుగు ఏరియా ఆసుపత్రిలో ఇంతకుముందు 100 పడకల, ఇప్పుడు అదనంగా 250 పడకల ఆసుపత్రి ఇప్పుడు జిల్లా ప్రజల అవసరాలమేరకు 350 పడకల ఆసుపత్రి ప్రజల కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.ములుగు ప్రజల ఆరోగ్య లక్ష్యమే ముఖ్యమని రక్తనమూనాలను పరీక్ష సెంటర్ ఎంఆర్ఐ స్కాన్ రేడియాలజీ 60 లక్షల నిధులతో ఈసీజీ అల్ట్రా సౌండ్ సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంబిస్తామన్నారు.ఈ జిల్లాలో 40రోజుల్లో పూర్తి చేస్తాం అన్నారు.సిరిసిల్ల జిల్లా కు ఒక ఆఫీసర్ ములుగు జిల్లాకు ఒక ఆఫీసర్ పర్యవేక్షణ చేస్తారని అన్నారు.హెల్త్ ప్రొఫైల్ లో నమోదైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం ఇస్తామని అన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి రక్త నామునాలు సేకరించి హెల్త్ డిజిటల్ కార్డ్ అందించాలని అధికారులను ఆదేశించారు.
యాంగ్ డైనమిక్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లాలో చురుగ్గా పనిచేస్తూ మేడారం జాతర విజయవంతం చేసినందుకు వారిని,వారి టీం ని అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవి ప్రజలకు చాలా సంక్షేమం ఇస్తుందని అందులో భాగంగానే ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తలపెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ములుగు జిల్లాలో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నందున జిల్లా ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ములుగు జిల్లాలో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రారంబించడం సంతోషం అని వారికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతమైన పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి ఫోటో మంత్రి హరీష్ రావు కు పాలాభిషేకం చేయాలని వారన్నారు.హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ 10 కోట్లు విడుదల చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఈ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు.పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ వెనుకబడ్డ ఈ జిల్లా ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తలసేమియా తదితర వ్యాధులనివారణకు రక్త నిధిని ఏర్పాటు చేయాలని వారు కోరారు.ములుగు జిల్లాను ముందుగా ఈ ప్రొఫైల్ ప్రాజెక్టులో ఎంపిక చేయటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు.ములుగు శాసనసభ్యురాలు సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీ జిల్లా అయిన ఆదివాసి జీవనంతో అనారోగ్యంతో బాధపడే గిరిజన ప్రజల కోసం ముందుగా ములుగు జిల్లా ఈ ప్రొఫైల్ ప్రొఫైల్ ప్రాజెక్టు ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఇసుక లారీల రద్దీ ఎక్కువ ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటి నివారణ లక్ష్యంగా ఆసుపత్రిలో డాక్టర్లను వైద్య సిబ్బందిని పెంచాలని మంత్రులు కోరారు గిరిజన యూనివర్సిటీ త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ ముఖచిత్రంపై ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ముందుగా ములుగు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ను ఎంపిక చేసి ప్రజల యొక్క ఆరోగ్య వివరాలను సేకరిస్తూ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ సంబంధించి జిల్లాలో ఆరోగ్య వివరాలను సేకరించే కార్యక్రమ వివరాలను వివరించారు. శుక్ర వారం రోజున ఎస్బిఐ కాలనీ డ్రై రాన్ నిర్వహించి శాంపుల్స్ సేకరించిన వారికీ ఈ రోజున మంత్రి చేతుల మీదుగా హెల్త్ డిజిటల్ కార్డ్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డు చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,జిల్లా జడ్పీ చైర్మన్ జగదీష్,వైస్ చైర్మన్ నాగజ్యోతి,అదనపు కలెక్టర్(ఎల్బి)ఇలా త్రిపాటి , అదనపు కలెక్టర్(రెవెన్యు) వైవి గణేష్,ఎఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకాన్,డిఆర్ఓ కె.రమాదేవి,జిల్లా వైద్య అధికారి అప్పయ్య,టి హబ్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రసాద్,ములుగు జిల్లా తాసిల్దార్ సత్యనారాయణ స్వామి,వెంకటాపూర్ తహసిల్దార్ మంజుల, టూరిజం శాఖ అధికారి శివాజీ,డిపిఓ వెంకయ్య,డీఎల్పీవో దేవరాజ్ సంబంధిత శాఖ అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.