ఆర్టికల్ -3 వజ్రాయుధం
– రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సిద్ధించింది
– ఎంపీ వినోద్ కుమార్
– జీవించేహక్కును ఎలా కాలరాస్తారు ఎంపీ అసద్
న్యూదిల్లీ,నవంబర్27(జనంసాక్షి): ఆర్టికల్ -3 వజ్రాయుధం అని టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడం అవాస్తవమని, విభజన తరవాత కావాలని వస్తున్నిలాంటి వాదనలపై ఆయన స్పందించారు. లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచం లోనే భారత రాజ్యాంగం అతి పెద్దదన్నారు. సమైక్యాంధప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అణచివేతకు గురైందని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని ఈ సందర్భంగా వినోద్ లోక్‌సభలో చెప్పారు. అందుకే ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్దదిగా గుర్తింపు పొందిందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ చాలా అణచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఆర్టికల్-3 ప్రకారం విభజన సమయంలో రాష్ట్రాల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. రాజ్యాంగ సభలో ఉన్న వాళ్లంతా లాయర్లు, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన ఉన్నవాళ్లేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని తెలిపారు. ఆర్టికల్-131ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలావుంటే అసలు సెక్యులరిజం అంటే ఏంటో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. ఈ దేశంలో ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, దాని ఉద్దేశ్యాలను కాలరాస్తోందని విమర్శించారు. ముస్లింల హక్కులను కాలరాస్తోన్న ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.