ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్ పతనం ప్రారంభం: పొన్నాల
వరంగల్,నవంబర్9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్ అని… ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ పతనం మొదలైందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారని విమర్శించారు. నాయకులను, కార్మికులను, విద్యార్థి సంఘాలను అడ్డుకుంటే ఉద్యమం ఆగదన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్కు సిగ్గు రావడం లేదన్నారు. బంతిని భూమికి కొడితే రెట్టింపు వేగంతో వస్తుందని కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని పొన్నాల స్పష్టం చేశారు.